Bigg Boss Telugu (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu: ఒక కామన్ మ్యాన్ ను.. లగ్జరీ మెయింటైన్ చేసే వాళ్ళు సెలెక్ట్ చేయడమేంటి?.. నెటిజన్లు ఫైర్

Bigg Boss Telugu:  బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ను పొగిడే వాళ్ళు ఉన్నారు. అలాగే తిట్టే వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సామాన్యులను హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెలక్షన్ ప్రాసెస్. ఈ షో ఆగస్టు 22, 2025 నుంచి సెప్టెంబర్ 5, 2025 వరకు జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా కామన్ పీపుల్స్ నుంచి వచ్చిన దరఖాస్తులను ఫిల్టర్ చేసి, టాస్క్‌లలో రాణించిన వారిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తారు.

Also Read: Tummala Nageswara Rao: అధికారం కోల్పోయిన పార్టీలవి చిల్లర మాటలు.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

ఈ షోకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. జడ్జ్‌లుగా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్, సీజన్ 1 కంటెస్టెంట్ నవదీప్, బిగ్ బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) విన్నర్ బిందు మాధవి ఉన్నారు. లక్షలాది దరఖాస్తుల నుంచి మొదట 100 మందిని, ఆ తర్వాత 45 మందిని, చివరగా 15 మందిని ఎంపిక చేశారు. ఈ 15 మంది మూడు గ్రూపులుగా విభజించబడి, వివిధ టాస్క్‌లను ఆడించి ఎంపిక చేస్తారు. ప్రతి గ్రూప్ నుంచి ఒకరు, మొత్తం ముగ్గురు బెస్ట్ పెర్ఫార్మర్స్‌గా ఎంపికవుతారు. మిగిలిన 12 మందిలో ఓటింగ్ ద్వారా టాప్ 2 మందిని ఎంపిక చేసి, మొత్తం 5 మంది బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపిక చేస్తారు.

Also Read: Vikarabad district: వికారాబాద్‌లో సంతోష్ ఏజెన్సీస్ గుట్కా స్కామ్.. డీఎస్పీ కార్యాలయం పక్కన మత్తు దందా!

ఈ రోజు నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే, దీనిపై కొందరు భిన్నాభిప్రయాలు వ్యక్త పరస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ కేవలం ఆట కాదు, ఇది జీవితానికి సంబంధించిన ఒక పాఠం. విజేతలు ఎవరైనా కావచ్చు, కానీ వీళ్ళ జీవితాలే నిజమైన స్ఫూర్తి. ఓరి నాయనో హౌస్ లోకి వెళ్లక ముందే గేమ్ స్టార్ట్ చేశారు, ఇంకా హౌస్లోకి వెళితే చూసి తట్టుకోవటం కష్టమే. ఈ షో మొత్తం స్క్రిప్టెడ్. వాళ్ళు సెలెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళని ముందే డిసైడ్ చేస్తారు. ఇదంతా ఓవరాక్షన్ అంతే. అగ్నిపరీక్ష అన్నారు.. కానీ మాకు మాత్రం పండగే. ఈ ముగ్గురు టైగర్స్ ఒకే ఫ్రేమ్‌లో చూడటం, ఫ్యాన్స్ కి ఇది కిక్ అంతే. అగ్ని పరీక్షలో కామన్ కామన్ మ్యాన్ అన్నారు అందరూ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్లు అసలు కామన్ మ్యాన్స్ లాగా కనిపిస్తున్నారా?  ఒక కామన్ మ్యాన్ ను.. లగ్జరీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటూ నెటిజన్స్  ఫైర్ అవుతున్నారు.

Also Read: Chiranjeevi – Pawan Kalyan: త‌మ్ముడు కళ్యాణ్.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి.. చిరంజీవి ట్వీట్ వైరల్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం