Tanuja vs Divya (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: టార్గెట్ తనూజ.. నెక్ట్స్ వీక్ వెళ్లిపోయేది తనేనా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 57వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 57) నామినేషన్స్ మోడ్‌తో నిండిపోయింది. ఒక్కొక్కరిలోని అసలైన రూపాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తనూజ ఈ వారం అందరికీ టార్గెట్ అయినట్లుగా ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. హౌస్‌లో ఇప్పటి వరకు తనూజను సపోర్ట్ చేసిన వారు, తనూజ సపోర్ట్ చేసిన వారంతా.. ఆమెకు రివర్స్ అయ్యారు. మరీ ముఖ్యంగా నాన్న, నాన్న అని పిలిచే భరణి (Bharani) కూడా తనూజ (Tanuja)తో బాండింగ్ నుంచి బయటపడే ప్రాసెస్‌లో ఉన్నారు. తనూజతో బాండింగ్ పెట్టుకున్న వారు.. ఎలిమినేషన్‌కు చాలా దగ్గర అవుతున్నారు. ఆదివారం వెళ్లిపోయిన మాధురి, అంతకు ముందు వెళ్లిపోయిన భరణి.. ఇలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. కాదు, కాదు ఎలిమినేట్ అయ్యేలా తనూజ వారిని మౌల్డ్ చేస్తుంది. తన గేమ్ ప్లాన్ అర్థం కాక.. ఆమె వలలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరూ రియలైజ్ అవుతున్నారు.

Also Read- Sreeleela: శ్రీలీలకు హిట్టొచ్చేది ఎప్పుడు? ఇక ఆశలన్నీ ఆ సినిమాపైనే!

టార్గెట్ తనూజ

ఇక సోమవారం ఎపిసోడ్‌కు సంబంధించి వచ్చిన 3వ ప్రోమో చూస్తే.. ఈ వారం తనూజ అందరికీ టార్గెట్ అయినట్లుగా అర్థమవుతోంది. ప్రతి వారం నామినేషన్స్‌లో రీతూ ఎక్కువగా హైలెట్ అవుతుండేది. కానీ ఈ వారం మాత్రం అంతా తనూజ నామ స్మరణే నడుస్తుంది. తనూజని ఇంటిలోని సభ్యులు చాలా మంది నామినేట్ చేసినట్లుగా ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు తెలియజేస్తున్నాయి. ఆమెను టార్గెట్ చేసిన తీరు చూస్తుంటే.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనిపిస్తుంది. ఆమె చేతిలో గోల్డెన్ బజర్ అస్త్రం ఉంది కానీ, అది ఆమెకు యూజ్ కాదు. దీంతో, ఈ వారం తనూజ ఆడియెన్స్ స్పందన మీదే సేవ్ కావాల్సి ఉంటుంది. హౌస్‌లో ఎంటరైనప్పటి నుంచి, ఇప్పటి వరకు ఏదో రకంగా సేవ్ అవుతూ వస్తున్న తనూజ అసలు రూపం ఇప్పుడు బయటపడుతుండటంతో.. ఆడియెన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read- Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు

ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావా..

ఇక తాజాగా వచ్చిన ప్రోమో 3 గమనిస్తే.. తన కంటే తనూజ స్ట్రాంగ్ అనుకుంటున్న రాముకి కళ్యాణ్ క్లాస్ ఇస్తున్నాడు. ‘తనూజతో పోల్చుకుంటే నువ్వు హౌస్‌లో కరెక్ట్ కాదు.. నువ్వు ఇప్పటికీ ఆటను వదిలేసుకుంటున్నావ్’ అంటూ సీరియస్‌గా చెబుతున్నాడు. ‘నేనైతే కెప్టెన్ అవడానికి ఎప్పుడూ రిక్వెస్ట్‌లు పెట్టుకోను. నేను పోటీ పడటానికి వచ్చాను.. ప్రాధేయ పడటానికి రాలేదు’ అంటూ సాయి అంటుంటే.. ‘నాకు సపోర్ట్ చేస్తారా? నాకోసం డ్యాన్స్ చేస్తారా? అని ఎవరినీ అడగలేదా?’ అని తనూజ ప్రశ్నిస్తుంది. దీంతో వారిద్దరి మధ్య వివాదం నడుస్తుంది. వెంటనే బిగ్ బాస్ మాట్లాడుతూ.. ‘హౌస్ కెప్టెన్‌గా నీకు ఒక ప్రత్యేక అధికారాన్ని ఇస్తున్నాను. ఒకరిని నేరుగా నామినేట్ చేసి కారణాలు చెప్పండి’ అని చెప్పారు. ఆమె తనూజని నామినేట్ చేసింది. దానికి కారణం చెబుతుంది. ‘నేను భరణిని నామినేట్ చేశాను కాబట్టి.. నువ్వు నన్ను నామినేట్ చేశావ్’ అంటూ దివ్యని తనూజ ప్రశ్నిస్తుంది. ‘ఒక పర్సన్‌ని సపోర్ట్ చేయలేకపోతే.. దానిని ఏడ్వడం మించి నీకేం తెలియదు’ అని తనూజ అంటే.. ‘ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావా తనూజ.. సీరియస్‌లీ. ప్రతి గేమ్ తర్వాత ఏడ్చేది నువ్వు.. నీలాగా సపోర్ట్ కోసం చేతులు కట్టుకుని అలా నుంచోలేదు నేను’ అంటూ దివ్య (Divya) ఇచ్చిపడేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!