Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ఏడవ వారం చివరికి చేరుకుంది. ఈ ఆదివారం కింగ్ నాగార్జున (King Nagarjuna) కంటెస్టెంట్స్‌తో కొన్ని టాస్క్‌లు ఆడించి, ఆటపాటలతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ వారం ఇచ్చిన టాస్క్ చాలా ఇంట్రస్ట్‌గా ఉంది. అలాగే కొన్ని ట్విస్ట్‌లు కూడా ఉన్నట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోలు తెలియజేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో 49వ రోజు (Bigg Boss Day 49)కు సంబంధించి తాజాగా రెండు ప్రోమోలు వచ్చేశాయి. మొదటి ప్రోమోలో టాస్క్‌కు సంబంధించి ఉండటమే కూడా సంజనకు మరో షాకింగ్ టాస్క్‌ని ఇచ్చారు. మొత్తంగా అయితే కింగ్ నాగార్జున కోసం ఆడియెన్స్, హౌస్‌మేట్స్ ఎందుకు అంతగా ఎదురు చూస్తారో.. మరోసారి ఈ ప్రోమోలు తెలియజేస్తున్నాయి. అసలీ ప్రోమోలలో ఏముందో చూద్దామా..
Also Read- Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది
వారం పాటు ఎవరితో మాట్లాడకూడదు
మొదటి ప్రోమో విషయానికి వస్తే.. ఫారిన్ లేడీస్ కింగ్ నాగార్జునకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. రీతూ, తనూజ, పవన్, సుమన్.. ఆల్ ద బెస్ట్ ఫర్ గోల్డెన్ బజర్ అంటూ డైరెక్ట్‌గా టాస్క్‌లోకి తీసుకెళ్లారు కింగ్. మరోవైపు మాధురి ఈ గేమ్‌లోని రూల్స్‌ని, ఏం చేయాలనే విషయాన్ని చదివి వినిపిస్తుంది. ‘తమకు కేటాయించిన బీకర్‌లో వారికి కేటాయించిన నీటిని పోసి, బీకర్‌లోని బాల్‌ని కింద పడేలా చేయాలి. బాల్ కింద పడిన తర్వాత డైరెక్ట్‌గా త్రో చేసి, వెల్‌కోకి అతుక్కునేలా చేయాలి. తర్వాత అక్కడున్న కీస్‌లో సరైన కీ తీసుకుని, బాక్స్‌ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత, వాళ్లకి కేటాయించిన బోర్డు పైన రిఫరెన్స్ పిక్ ఉన్న విధంగా పజిల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫజిల్ పూర్తయిన తర్వాత రోజ్ రూమ్‌కి చేరుకుని, మీ కలర్ రింగ్‌ని తీసుకుని పెడెస్టెల్ మీద ఉన్న ఎల్లో స్టోన్ మీద పడేలా త్రో చేయాలి’ అని మాధురి చదువుతుంటే.. అన్ని పూర్తి చేసి తనూజ ముందుగా రోజ్ రోమ్‌కి చేరింది. మరోవైపు కింగ్ నాగార్జున ఇమ్ముతో ఇన్వివిజిబుల్ కేప్ తెప్పించి, ఒక వారం పాటు దీనిని వేసుకున్న వాళ్లు ఎవరితో మాట్లాడకూడదు అనే టాస్క్‌ని విధించారు. దీనిని ధరించిన వాళ్లు హౌస్‌లో ఉన్నా.. లేనట్టేనని చెప్పారు. దీనిని ఎవరికి ఇస్తావ్ అని ఇమ్మూని అడగగానే.. ఇంకెవరికి మా అమ్మకే అని సంజనకు ఆ కేప్‌ని ఇచ్చారు. అలా ఈ వారం అంతా సంజనని లాక్ చేశారు. ఇమ్ము, సంజనల మధ్య కామెడీతో ఈ ప్రోమో ముగిసింది.
Also Read- Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?
ఎవరి మేఘం వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్
రెండవ ప్రోమోని గమనిస్తే.. బోర్డు మీద చాలా మంది సెలబ్రిటీలను చూపిస్తూ.. ఆ సెలబ్రిటీల వెనుకాల ఓ ఐటమ్ ఉంటుందని కింగ్ నాగ్ చెబుతున్నారు. ఆ ఐటమ్‌తో వచ్చే పాటని ప్లస్ ఆ సెలబ్రిటీ ఉన్న పాటని గెస్ చేయాలనే ఆటని కంటెస్టెంట్స్‌తో కింగ్ ఆడిస్తున్నారు. కొందరు కరెక్ట్‌గానే పాటను కనిపెడుతున్నారు. అనంతరం మరో గేమ్‌ని కింగ్ ఆడించారు. ప్రతి టీమ్ నుంచి ఇద్దరు మెంబర్స్ బ్లైండ్ ఫోల్డై వస్తారు. నేను ఏ ఐటమ్ నెంబర్ అయితే చెప్పానో.. ఆ ఐటమ్‌ని ఒకరు టేస్ట్ చేసి, దానిని అవతలి వాళ్లకి చెప్పాలని కింగ్ వివరించారు. చాలా వింతగా ఈ గేమ్ నడుస్తుంది. అనంతరం ఎలిమినేషన్ (Bigg Boss Elimination)కు వెళ్లిపోయారు. ఈ రోజు మీ ఆట మీద మబ్బులు అలుముకున్నాయ్ అంటూ సంజన, రమ్యలను ఓ గదిలో ఉంచి.. ఎవరి క్లౌడ్ నుంచి వర్షం పడుతుందో, ఎవరి మేఘం వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్ అని కింగ్ క్లారిటీ ఇచ్చారు. వారిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది మాత్రం రివీల్ చేయలేదు. ఓవరాల్‌గా, ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి సరిపడా కంటెంట్‌తో ఈ సండే నాగ్ రెడీ అయ్యారనేది ఈ ప్రోమోస్ చెప్పేస్తున్నాయి. చూద్దాం మరి.. ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
