Bigg Boss Day 35
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఫైర్ స్ట్రోమ్.. డే 35 కిక్కే కిక్కు.. అన్‌ప్రిడక్టబుల్ వైల్డ్ కార్డ్స్, ఎలిమినేషన్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season9) లో కొత్త చాప్టర్ మొదలు కాబోతోంది.. అవును, ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ కింగ్ నాగార్జునే (King Nagarjuna) చెప్పారు. 35వ రోజు ఆదివారానికి (Sunday Episode) సంబంధించి తాజాగా రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఒక ప్రోమో ఎమోషన్స్‌ని నింపితే.. మరో ప్రోమో షో లాంచింగ్ డే‌ని తలపిస్తోంది. మొత్తంగా అయితే ఈ సండే బిగ్ బాస్ వీక్షకులకు మాత్రం ఫుల్ కిక్కే కిక్కు అనేలా ఈ రెండు ప్రోమోలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ 5వ వారం వీకెండ్‌కు చేరుకుంది. వీకెండ్ అంటే ఎలిమినేషన్ పక్కాగా ఉంటుంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమేషన్‌తో పాటు అన్‌ప్రిడక్టబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నట్లుగా ఈ ప్రోమోలలో బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశారు. అందుకే హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్‌లో కొత్త చాప్టర్ మొదలు కాబోతుందని చెప్పేశారు. అసలీ ప్రోమోలలో ఉన్న విషయానికి వస్తే..

Also Read- OTT Releases: ఈ వారం ఓటీటీలో మన ముందుకొచ్చే వినోదం ఇదే.. రండి ఓ లుక్కేద్దామ్..

ఫ్లోరా లైఫ్‌ లైన్ ఆగిపోయిందా?

ముందు మొదటి ప్రోమోని గమనిస్తే.. ఇందులో ఎక్కువగా ఎలిమినేషన్‌పైనే దృష్టి పెట్టారు. హౌస్‌లో ఉన్న వాళ్లందరినీ ఎమోషనల్‌కి గురి చేశారు. ఎవిక్షన్‌లో ఉన్న రీతూ, ఫ్లోరా.. ఇద్దరూ యాక్టివిటీ రూమ్‌కి వచ్చేయండి అని నాగ్ పిలిచారు. మిగిలిన హౌస్‌మేట్స్‌తో.. ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? వారిపై మీ అంచనాలు ఏంటి? అని నాగ్ ప్రశ్నించారు. ఇందులో ఎక్కువ శాతం ఫ్లోరా వెళ్లిపోతుందని జవాబు చెబుతున్నారు. ఎందుకు వెళుతారో కూడా రీజన్ చెబుతున్నారు. మ్యాగ్జిమమ్ మెంబర్స్ ఫ్లోరా వెళ్లిపోతుందని చెప్పారు. అనంతరం ఎవిక్షన్‌లో ఉన్న ఇద్దరినీ.. మీరు ఈ హౌస్‌లో ఎవరిని బాగా మిస్ చేస్తారు అని ప్రశ్నించగానే ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. సంజన పేరు చెప్పి ఫ్లోరా ఏడ్చిస్తే, పవన్ పేరు చెప్పి రీతూ ఏడ్చేసింది. హౌస్‌లోని వారు కూడా సేమ్ ఎమోషన్‌లో మునిగిపోయారు. మీ ఉద్దేశ్యం ఏదైనా, ఆడియెన్స్ ఉద్దేశ్యం ఏంటి? అనేది చూద్దాం అంటూ.. డైరెక్ట్‌గా ఎవిక్షన్‌కు వెళ్లిపోయారు. ఈ ఆటలో ఎవరి లైఫ్‌ లైన్ పోతుందనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు.. కేవలం ఆడియెన్స్ ఓట్స్‌తో అని నాగ్ చెబుతున్నారు. ఒకరి లైఫ్ లైన్ ఆగినట్లుగా చూపించారు కానీ, ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. ఫ్లోరానే ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా లీక్స్ ద్వారా తెలుస్తుంది.

Also Read- Lord Shiva: ప్రళయం వచ్చినప్పుడు శివుడు ఆ ఒక్క నగరాన్ని మాత్రమే రక్షిస్తాడు? దానికి అంతమే లేదా?

వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇస్తుంది వీరేనా?

ఇక రెండో ప్రోమో అయితే మాములుగా లేదు. మొదట చెప్పుకున్నట్లుగా లాంఛింగ్ ఎపిసోడ్‌ని తలపిస్తుంది. బిగ్ బాస్ తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి, కన్నడ హోస్ట్ సుదీప్, మలయాళ హోస్ట్ మోహన్ లాల్ కూడా ఇందులో భాగమయ్యారు. ఈ ప్రోమో అంతా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి సంబంధించిన ఇంట్రడక్షన్‌తోనే నింపేశారు. ఒకరిద్దరు కాదు.. ఓ నలుగురైదుగురు ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఈ ప్రోమో‌లో చూపించారు. మరి వారు ఎవరనేది తెలియాలంటే మాత్రం ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వారిలో ఆయేషా, దివ్వెల మాధురి, రమ్య పికిల్స్, నిఖిల్ నాయర్ వంటి వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్