Bigg Boss Telugu 9: బిగ్ బాస్ సీజన్ 9 చివరికి వచ్చేసింది. ఇంకా బిగ్ బాస్ ఇంట్లో తనూజ, డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్, ఇమ్మానూయేల్, సంజన ఉన్నారు. వీరిలో సంజన, డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్ హౌస్ లో ఇన్ని రోజులు ఉంటారని అస్సలు అనుకోలేదు. అయితే, ఈ రోజుకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. 100 వ రోజుకు తగ్గట్టుగానే టాస్క్ లు పెట్టాడు .
ప్రోమో స్టార్టింగ్ లోనే ఒన్స్ మోర్ వన్ లాస్ట్ టైం లో భాగంగా ఇంటి సభ్యులకు ఇస్తున్న టాస్క్ సేవ్ ఇట్.. టూ విన్ ఇట్ అని స్టార్ట్ చేశాడు. అయితే, హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చి టాస్క్ గుర్తుందిగా.. చాలా బాగా ఆడారు కదా అని బిగ్ బాస్ పేలిపోయే కౌంటర్ వేశాడు. దీనికి హౌస్ మేట్స్ సారీ బిగ్ బాస్ అని చెప్పారు. ఈ సారైనా సరిగ్గా అర్ధం చేసుకుని ఆడతారా? సొంత తెలివి తేటలు ప్రదర్శిస్తారా అని ఇంట్లో వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు పవన్ మాకు తెలివి తేటలు ఎప్పుడో పోయాయి బిగ్ బాస్ అని ఫన్నీగా చెప్పాడు.
టాస్క్ లో భాగంగా డిమాన్ పవన్ ఇప్పుడు నన్ను కూర్చోమన్నా ఒక వేళ రేపన్న రోజు నేను కూర్చొను. అలా అయితే ఇమ్మానూయేల్ ఖాళీగా కూర్చోబెట్టి 3 స్టార్స్ పెడదాం అని తనూజ డిమాన్ పవన్ తో అన్నది. ఇప్పుడు వీళ్లు కూర్చొన్న వీళ్ళకి ఒక్కో స్టార్ వస్తది.. అప్పుడు నువ్వే గా గెలిచేదని ఇమ్మానూయేల్ అనగా..ఒక వేళ మీరు గెలిస్తే నేను ఏం చేయాలి? అందుకే నేను కూర్చోవడం లేదు. లేదంటే నేను కూర్చొనే వాడిని అంటూ పవన్ ఇంటి సభ్యులతో ఫైట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్ లాగా చేసి బెలూన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇమ్మానూయేల్ బెలూన్స్ వేస్తుండగా కళ్యాణ్ వాటిని ఊదుతూ బ్రేక్ చేస్తున్నాడు. ఈ టాస్క్ చూడటానికి ఈజీగా ఉందని కానీ ఆడే వాళ్ళకి కష్టంగా ఉంటుంది.

