Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 98వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 98) ఆదివారం.. కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో చేయించిన టాస్క్.. వీక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందనే విషయాన్ని తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. ఇప్పటి వచ్చిన ప్రోమోలో థమన్, అనిష్ గెస్ట్‌లుగా కనిపించారు. ఇక ‘హౌస్ ఫన్’ అంటూ వచ్చిన ప్రోమో అయితే.. జనాలకు ఫీస్ట్ అనే చెప్పాలి. శనివారం సుమన్ శెట్టి ఎలిమినేషన్‌తో అంతా ఎమోషన్ నడిచింది. సుమన్ శెట్టి (Suman Shetty) వెళుతూ, వెళుతూ అందరినీ బంగారమే అని అనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భరణి బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆ ఎమోషన్ నుంచి హౌస్‌మేట్స్‌ని, ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు నాగ్ ఏం చేశారంటే..
Also Read- Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది
హౌస్ ఫన్
‘ఇప్పుడీ హౌస్‌లో ఉన్నవాళ్లు ఏం చేయాలంటే.. ఇప్పటి వరకు హౌస్‌లో జరిగిన మోస్ట్ పాపులర్ సిచ్యుయేషన్స్‌ని రీ క్రియేట్ చేయాలి’ అని కింగ్ నాగార్జున చెప్పగానే.. రీతూ, పవన్‌ల మధ్య జరిగిన ఫైట్ సీన్‌ని సంజన, భరణి (Bharani) చాలా కామెడీగా చేసి చూపించారు. ఆ తర్వాత రీతూ, భరణి మధ్య ట్రయాంగిల్ టాస్క్‌లో జరిగిన గొడవని కళ్యాణ్, తనూజ, సంజన రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ రీతూగా యాక్ట్ చేసిన భరణి.. ఫుల్ మార్క్స్ కొట్టేశారు. వీరి తర్వాత రమ్య పాత్రలో తనూజ, తనూజ పాత్రలో భరణి ఓ టాస్క్ చేశారు. అందులో తనూజగా భరణి అద్భుతంగా చేశారు. కళ్యాణ్ పాత్రని ఇమ్ము చేశారు. ఓ వారం నామినేషన్స్ టైమ్‌లో సుమన్, సంజనల మధ్య జరిగిన వాగ్వివాదాన్ని సంజనగా డిమాన్, సుమన్‌గా ఇమ్ము చేసి చూపించారు. ఇద్దరూ కామెడీని పండించారు. మొత్తంగా చూస్తే.. ఈ సండే షో చూసే వారికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనేలా ఈ ప్రోమో ఉంది.
Also Read- Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!
కంప్లయింట్స్, ఫ్రస్ట్రేషన్స్
‘వీకెండ్ మస్తీ’ అంటూ వచ్చిన ప్రోమోలో.. ‘ఎవరి మీదైనా కంప్లయింట్ ఉంటే, మీ ఫ్రస్ట్రేషన్స్, మీ రేజ్ అన్నీ చెప్పొచ్చు. మీకొక గిఫ్ట్ కూడా వస్తుంది’ అని నాగ్ చెప్పగానే ఇమ్మానుయేల్‌పై ఉన్న కంప్లయింట్స్ అన్నింటిని తనూజ చెబుతుంది. ఆమె చెప్పే ప్రతి పాయింట్‌కి కాఫీ పొడి పాకెట్స్ గిప్ట్‌గా గెలుచుకుంది. దీని కోసం తనూజ మాట్లాడుతూనే ఉంది. హౌస్‌మేట్స్ కూడా ఆమె మాటలకు షాక్ అవుతున్నారు. ఏదయితేనేం.. తనకి కావాల్సిన కాఫీ పొడి ప్యాకెట్స్ మాత్రం సంపాదించుకుంది. ఆ తర్వాత డిమాన్ పవన్ వచ్చి, తనూజపై కంప్లయింట్స్ చేస్తున్నాడు. అసలు వంటే రాదు కానీ, వచ్చినట్లుగా షో చేస్తుంటుందని.. ఇలా చాలానే కంప్లయింట్స్ చెప్పాడు. తనకి కావాల్సిన వాటిని గిఫ్ట్‌గా పొందాడు. ఇమ్మానుయేల్ వచ్చేసి సంజనపై కంప్లయింట్స్ చేస్తున్నాడు. నేను చెప్పిన మాట ఒక్కటీ వినదు.. ప్రతిసారీ నాతో గొడవ పెట్టుకుంటది.. వీకెండ్‌లో మీరు రాగానే ఫస్ట్ నన్నే నిలబెట్టి.. నీది తప్పా? మీ మమ్మీది తప్పా? అంటారు. తప్పని చెప్పినా కూడా వినదు సార్.. అని చెబుతున్నాడు. తనకి కావాల్సినవి గిఫ్ట్స్ రూపంలో పడుతున్నాయి. అలా.. ఈ సండే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్ అనేలా ఈ ప్రోమోస్ తెలియజేశాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

