Tanuja Interview: బిగ్ బాస్ సీజన్ 9 నుండి ఎలిమినేట్ అయిన ‘లేడీ టైగర్’ తనుజ, తన ప్రయాణం గురించి, హౌస్‌లో జరిగిన సంఘటనల గురించి ‘బిగ్ బాస్ బజ్జు’ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ప్రయాణంపై సంతృప్తి బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రయాణం పట్ల తనుజ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ నవ్వులు, ఏడుపులు, కోపతాపాలు ఇలా అన్ని రకాల భావోద్వేగాల కలయికతో కూడిన ఒక అందమైన ప్రయాణం సాగిందని ఆమె తెలిపారు.
Read also-Prabhas Charity: ప్రభాస్ చేసిన పనికి సలాం కొడుతున్న రాజీవ్ కనకాల.. ఎందుకంటే?
అవకాశవాది అన్న విమర్శలపై స్పందన హౌస్‌లో తనుజను కొందరు అవకాశవాదిగా భావించడంపై హోస్ట్ శివాజీ ప్రశ్నించగా, ఆమె స్పష్టత ఇచ్చారు. తనకు స్వార్థం ఉండి ఉంటే, ఇతర కంటెస్టెంట్లకు ఆటలో మెలకువలు నేర్పే దానిని కాదని, వారు బాగా ఆడాలని కోరుకునే దానిని కాదని ఆమె వివరించారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పి వారిని ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. డబ్బు కంటే ప్రేక్షకుల ప్రేమే ముఖ్యం షో నుండి రూ. 20 లక్షల రూపాయల ఆఫర్‌ను ఎందుకు వదులుకున్నారన్న ప్రశ్నకు ఆమె భావోద్వేగంగా సమాధానమిచ్చారు. తను డబ్బు కోసం ఆశపడే వ్యక్తిని కాదని, తనకు తన ఆడియెన్స్ దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకులేనని వారు తనకు దేవుళ్లు గా భావిస్తున్నానని చెబుతూ.. వారిపై కృతజ్ఞత చాటుకున్నారు.
Read also-Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’
ఇదే సందర్భంలో తన తండ్రి గురించి చెబుతూ ఎమోషన్ అయ్యారు. తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమ తనుజ తన తండ్రి పట్ల ఉన్న ప్రేమాభిమానాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టాప్-5 ఫైనలిస్టుల తల్లిదండ్రులు వచ్చినప్పుడు, తన తండ్రి కూడా వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశానని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీనిని చూసిన ఆడియన్స్ కూడా బావోధ్వేగానికి లోనయ్యారు. విజేతగా నిలిచి కప్పును తన తండ్రి చేతిలో పెట్టి “ఇదీ నీ కూతురు” అని గర్వంగా చెప్పాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిపేరులో ఉన్న ‘పుట్టస్వామి’ అనేది తన తండ్రి పేరని, ఆయనపై ఉన్న ప్రేమతోనే తన పేరు పక్కన ఎప్పటికీ ఆ పేరును ఉంచుకుంటానని, అంతే కానీ నిజంగా అది తన ఇంటిపేరు కాదిని ఆమె స్పష్టం చేశారు.

