Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్(భయ్యా సందీప్) (Bayya Sunny Yadav) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బైక్‌పై దేశ విదేశాలు తిరుగుతూ పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియా (Social Media) లో ఫాలోవర్స్‌ను పెంచుకుని ప్రముఖ యూట్యూబర్‌గా మారాడు. కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్‌లో ఇతను పేరు బాగా వినపడింది. అంతక ముందే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నూతనకల్ పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కాస్త స్ట్రాంగ్‌గానే చెబుతూ, పోలీసులకు వివరించారు. దీంతో, నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో భయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Pawan Kalyan – Chandrababu: చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం.. మామూల్గా ఆకాశానికెత్తలేదు భయ్యా!
ఆపరేషన్ సిందూర్ సమయంలో సన్నీ అక్కడే ఉన్నాడా?
ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్థాన్ ఎందుకు వెళ్ళాడు? అతను అక్కడికి వెళ్లి ఎందుకు తల దాచుకున్నాడు? కొద్దీ రోజుల క్రితం పాకిస్థాన్ గూఢచారి జ్యోతి ను అరెస్ట్ చేసి, విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా సన్నీ యాదవ్ ఇండియాలో లేడు. పాకిస్థాన్ లోనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, అంతక ముందు 5 సార్లు అక్కడికి వెళ్ళాడని తెలిసిన సమాచారం. అన్ని సార్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు.
తప్పు ఎవరిది?
ఒకరు తప్పు చేస్తే అందరికీ శిక్ష పడుతుందా? ఇప్పటికీ ఇద్దరూ యూట్యూబర్లు శత్రు దేశం వెళ్లి మరి టూర్ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? వీరిని ఎంకరేజ్ చేస్తున్న వారి ఫ్యాన్స్ దా లేక విచ్చల విడిగా తిరిగేందుకు పర్మిషన్స్ ఇస్తున్న టూరిజం శాఖదా? ఇలా ఒక్కొక్కొటి బయటకు వస్తుంటే .. మిగిలిన వ్లాగర్స్ ఇంక మాకేలా పర్మిషన్స్ ఇస్తారంటూ లబో దిబో అంటున్నారు.