Bhagyashri Borse: ‘అరుంధతి’ తరహా పాత్ర చేయాలని ఉంది
Bhagyashri Borse (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhagyashri Borse: ‘అరుంధతి’ తరహా పాత్ర చేయాలని ఉంది.. ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో?

Bhagyashri Borse: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. (Bhagyashri Borse Andhra King Taluka Interview)

Also Read- MLA Raja Singh: రాజమౌళిని జైల్లో వేస్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!

పరిచయం లేకపోయినా అంతగా ఎందుకు అభిమానిస్తారో తెలిసింది

‘‘ఇందులో నేను మహాలక్ష్మి అనే పాత్రలో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఆ పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. ఈ సినిమాకు మహాలక్ష్మి పాత్ర చాలా ఇంపార్టెంట్. సినిమా చూసేటప్పుడు అందరికీ అది అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వుంటుంది. అభిమానం అనేది డివైన్ ఎమోషన్ వంటిది. నేను నార్త్ నుంచి సౌత్‌‌కి వచ్చినప్పుడు.. ఇక్కడి అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ని ఇంత గొప్పగా ఆరాధిస్తారా.. ప్రేమిస్తారా అని ఆశ్చర్యపోయాను. ఎలాంటి రిలేషన్ లేకుండా, అసలు పరిచయమే లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. దర్శకుడు మహేష్ ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది. ఇందులో సూపర్ స్టార్‌గా ఉపేంద్ర నటించారు. ఆయనతో నాకు ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయన వెరీ హంబుల్ యాక్టర్. చాలా డౌన్ టు ఎర్త్. ఆయనతో వర్క్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేని సంతోషాన్నిచ్చింది.

Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

అరుంధతి తరహా పాత్రలిష్టం..

ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ‘నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో’ పాటలు అంతా చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ ఇందులో ఉంటుంది. రామ్‌తో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. తను వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ‌ని నేను కూడా మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇది 2000లో జరిగే కథ, డైరెక్టర్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్.. ఇలా అన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ సన్నివేశం ఉంది. డైరెక్టర్ సీన్ మొత్తం వివరించారు. ముందు నేను ఎలా అనుకుంటున్నానో అలా చేసి చూపిస్తానని డైరెక్టర్‌కు రిక్వెస్ట్ చేశాను. నేను చేసింది అందరికీ నచ్చింది. అలాంటి క్రియేటివ్ స్పేస్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు నటించారు. వారందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముందు ముందు నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి పాత్రకు 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. ఒక వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. మరీ ముఖ్యంగా అనుష్క అరుంధతిలో చేసినటువంటి పాత్రలంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!