Bhairavam Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Bhairavam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల ‘భైరవం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Bhairavam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రలలో నటించిన మల్టీహీరోల చిత్రం ‘భైరవం’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పవర్ ఫుల్ పోస్టర్లు, యాక్షన్‌తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్‌తో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పాట రొమాంటిక్ మెలోడీగా, రెండో సింగిల్ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్‌గా ఉండి, ఇప్పటికీ మోత మోగిస్తూనే ఉన్నాయి. దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ (Sri Sathya Sai Arts) బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

Also Read- Vijay Deverakonda: బర్త్‌‌డే స్పెషల్‌గా రెండు న్యూ మూవీస్ అనౌన్స్‌మెంట్.. ఆ పోస్టర్స్ చూస్తుంటేనా?

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా మే 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయం తెలుపుతూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్ ఫుల్ ఫెస్టివల్ వైబ్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమాలలో హీరో హీరోయిన్లు పాల్గొని, స్టేజ్‌పైన డ్యాన్స్‌లు చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించారు. మరీ ముఖ్యంగా సంచలన దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదితి శంకర్ వేసే డ్యాన్స్ స్టెప్పులు ప్రతి ఈవెంట్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయంటే అతిశయోక్తి కానే కాదు.

Also Read- Allu Aravind: ‘ఆపరేషన్ సింధూర్’.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం!

అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ ఆ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌‌గా ఉంటుందని టాక్ నడుస్తుంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో.. మంచు మనోజ్ కోసం చిత్ర షూటింగ్‌ని కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని.. ఇకపై ఓ రేంజ్‌లో నిర్వహించేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ మూడు వారాల్లో మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకులలోకి ఎలా తీసుకెళ్లనున్నారో.. వెయిట్ అండ్ సీ.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..