Vijay Deverakonda New Movies
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: బర్త్‌‌డే స్పెషల్‌గా రెండు న్యూ మూవీస్ అనౌన్స్‌మెంట్.. ఆ పోస్టర్స్ చూస్తుంటేనా?

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. లక్ ఆయన పరం కాబోతున్నట్లుగా తాజాగా విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ‘లైగర్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ని ఏర్పడేలా చేసింది. ఈ సినిమానే అనుకుంటే, ఇప్పుడు మరో రెండు నూతన సినిమాలు కూడా ఆయన అనౌన్స్ చేశారు. శుక్రవారం (మే 9) విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఆయన నటించబోతున్న రెండు నూతన సినిమాలను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో VD14 పోస్టర్ చూస్తుంటే.. రౌడీకి మంచి రోజులు వచ్చాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలా ఉంది ఆ పోస్టర్. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Kamal Haasan: ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్.. గుండెలు పిండేసిన కమల్ హాసన్

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘వీడీ 14’. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండని చూస్తుంటే, సినిమాపై అంచనాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతున్నాయి. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని కథాంశంతో, ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది.

Also Read- Allu Arjun: డ్యూయల్ రోల్.. అయ్యబాబోయ్! అట్లీతో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా?

విజయ్ దేవరకొండతో ఎస్‌వీసీ59
ఇటీవల నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడని చెప్పిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో రౌడీ చేయబోతున్న క్రేజీ మూవీని విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలుపుతూ SVC59 మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇంటెన్స్ అవతార్‌లో రౌడీ కనిపిస్తున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుందని, త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

">

విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం
విజయ్ దేవరకొండ తన పుట్టినరోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ ‘రౌడీ వేర్’ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లుగా విజయ్ దేవరకొండ ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ.. సోషల్ మీడియా ద్వారా విజయ్ ఓ వీడియోను షేర్ చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు