Allu Arjun Atlee Film Update
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: డ్యూయల్ రోల్.. అయ్యబాబోయ్! అట్లీతో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా?

Allu Arjun: ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి, ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి బయటికి వస్తున్న విషయాలు వింటుంటే.. అట్లీ (Atlee)తో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా? అని అనిపించకమానదు. రిస్క్ అంటే అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం. రిస్క్ చేయకుండా సక్సెస్ రాదని నమ్మే హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. అందుకే ‘పుష్ప’ సిరీస్ చిత్రాలు వచ్చాయి. వాస్తవానికి ‘పుష్ప’ కథని సుకుమార్ ముందుగా ఎవరికి వినిపించారో తెలియంది కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కి ‘పుష్ప’ కథని వినిపించిన సుకుమార్, ఆయన నుంచి పాజిటివ్ స్పందనను అందుకున్నారు. మరి ఏమైందో ఏమో.. ఆ తర్వాత రెండు రోజులకే, ఈ ప్రాజెక్ట్ నేను చేయడం లేదని మహేష్, సుకుమార్‌కి చెప్పేశారు. అంతే, అప్పటికప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లిన సుకుమార్.. ‘పుష్ప’ (Pushpa) సినిమాను అనౌన్స్ చేశారు.

Also Read- Manchu Lakshmi: మంచు మనోజ్‌ని అంత మాట అనేసిందేంటి? ఇదన్నమాట మ్యాటర్!

నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ రిస్క్ తీసుకున్నాడనే చెప్పాలి. కానీ, తనకు లైఫ్ ఇచ్చిన సుకుమార్‌ (Sukumar)కి నో చెప్పేంత ధైర్యం అల్లు అర్జున్‌కు లేదు. ఆ సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా సరే.. ‘పుష్ప’ సినిమా చేయాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడు. ఆయన చేసిన రిస్క్, నిజంగా ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును, నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇంకా ఎన్నో అవార్డులు ఆయన కోసం వేచి చూస్తున్నాయి. అంతకు ముందు దేశభక్తి నేపథ్యంలో చేసిన ‘నా పేరు సూర్య’ (Naa Peru Surya) సినిమా కూడా అల్లు అర్జున్ రిస్కే చేశాడు. ఆ సినిమా పరాజయం చవిచూసినప్పటికీ అందులోని అల్లు అర్జున్ పాత్ర మాత్రం ఆయన స్టార్‌డమ్‌ని మరింతగా పెంచేసింది. నిజంగా అలాంటి పాత్ర చేయడానికి ఘట్స్ కావాలి. నాలో ఉందే అవి అనేలా అల్లు అర్జున్ దూసుకెళ్లారు.

‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో వచ్చిన సక్సెస్‌, గుర్తింపు తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ పాన్ ఇండియా గుర్తింపు పొందిన హీరో తను. అలాంటి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కూడా మంచి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తాడని అంతా ఊహిస్తారు. కానీ అందరూ ఊహించినది అల్లు అర్జున్ చేస్తే కిక్ ఏముంది? మళ్లీ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నాడు. అవును, ఇప్పటి వరకు తన కెరీర్‌లోనే లేని విధంగా అట్లీతో చేసే సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా ఉండే ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలలో అల్లు అర్జున్ కనిపిస్తాడనేలా కోలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వస్తుండటం విశేషం.

Also Read- Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!

ఇంకా చెప్పాలంటే.. ‘వాలి’ సినిమాలో అజిత్ కుమార్ కనిపించిన విధంగా అల్లు అర్జున్ పాత్రల తీరు ఉంటుందని, కాకపోతే సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళుతుందనేలా టాక్ మొదలైంది. మరీ ముఖ్యంగా ఇందులో విలన్‌ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం మహేష్, ప్రభాస్‌ల ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో సినిమాకు కావాల్సిన విధంగా అల్లు అర్జున్ మౌల్డ్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు రీసెంట్‌గా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు