Allu Aravind on Operation Sindoor
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: ‘ఆపరేషన్ సింధూర్’.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం!

Allu Aravind: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్ – పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య దాదాపు మినీ యుద్ధమే నడుస్తుంది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దీటుగా భారత్ బదులిస్తోంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట పహల్గాం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు చేసిన దాడిలో దాదాపు 26 మంది భారతీయులు ప్రాణాలను కోల్పోయారు. వారి మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కూడా భారత్‌పై దాడికి తెగబడగా, భారత్ (India) సైన్యం ఇస్తున్న రియాక్షన్‌కు పాక్ కుదేలవుతుంది. ప్రస్తుతం భారత్ సైన్యానికి భారతీయులందరూ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అరవింద్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read- Allu Arjun: డ్యూయల్ రోల్.. అయ్యబాబోయ్! అట్లీతో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా?

అదేంటంటే.. ఆయన సమర్పణలో శ్రీ విష్ణు (Sree Vishnu), కేతిక శర్మ, ఇవానా జంటగా నటించిన చిత్రం ‘సింగిల్’ (Single Movie). గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందనను రాబట్టుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న తరుణంలో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో చిత్రాన్ని సమర్పించిన నిర్మాత అల్లు అరవింద్ (Producer Allu Aravind) సంచలన ప్రకటన చేశారు.

Also Read- Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!

ఆయన మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై.. మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకు ఉంటుంది. ‘సింగిల్’ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించాలని నిర్ణయించుకున్నాం. మనకోసం ఎంతో చేస్తున్నారు. వారికి ఆ మాత్రం అండగా నిలవకపోతే ఎలా? అంటూ ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరూ సైన్యానికి అండగా ఉన్నామని చెబుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు. జైహింద్ అంటూ వారందరికీ సెల్యూట్ చేస్తున్నారు. కానీ, ఇలా సైన్యానికి తమ సినిమా లాభాల్లో కొంత మేర అమౌంట్ పంపిస్తామని ప్రకటించిన ఫస్ట్ పర్సన్ మాత్రం అల్లు అరవిందే. అందుకే ఆయనని అంతా మాస్టర్ బ్రెయిన్ అంటుంటారు. ఏ నిర్ణయమైనా చాలా ఫాస్ట్‌గా తీసుకోవడంలో తనకు తానే సాటి అని అల్లు అరవింద్ మరోసారి నిరూపించుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!