Kishkindhapuri
ఎంటర్‌టైన్మెంట్

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూసిన వారంతా.. ఏం అడుగుతారంటే?

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?

కచ్చితంగా భయపెడతాం

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) మాట్లాడుతూ.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల వంటి వారంతా మా సినిమాను సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశాం. సెప్టెంబర్ 12న ‘కిష్కింధపురి’ థియేటర్లలోకి వస్తుంది. భయపెట్టడమనేది ఒక ఆర్ట్. ఈ సినిమాతో ఆడియన్స్‌ని కచ్చితంగా భయపెడతాం. అలాగే వారికి ఒక మంచి విజువల్, సౌండ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు ఒక మంచి కథ చూశామనే శాటిస్ఫాక్షన్ ఇస్తాం. అద్భుతమైన కథను రెడీ చేసిన మా డైరెక్టర్ కౌశిక్‌‌కు థాంక్యూ. కౌశిక్ ఈ సినిమాతో చాలా మంచి స్థాయికి వెళ్తారు. చిన్మయి గ్రేట్ విజువల్స్, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అన్నీ కలగలిపి.. సెప్టెంబర్ 12న థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ సినిమాలో లీనమైపోతారు.

Also Read- Kaantha: ‘కాంత’ విడుదల వాయిదా.. టీమ్ ఏం చెప్పిందంటే?

కొంచెం వెలితి కూడా ఉంది

ఒక సినిమాకి ఎంతో మంది కష్టపడతారు. ఎన్నో కలల తోటి చాలా కష్టపడి ఒక సినిమా చేస్తాం. అంతా కూడా ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనే అనుకుంటాం. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి మా టీమ్‌ను సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా గూస్ బంప్స్‌తో.. అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. నేను చాలా మంది ప్రొడ్యూసర్స్‌ను చూశాను. సాహు వంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. మాలాంటి వాళ్ళకి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. పది మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఆయన నాతో ఒక కమర్షియల్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అనుపమ, నేను ‘రాక్షసుడు’తో మంచి హిట్ కొట్టాం. అందరూ ‘రాక్షసుడు 2’ ఎప్పుడు అని అడుగుతున్నారు. ‘కిష్కింధపురి’తో దానికి మించిన సినిమా చేశాం. ఈ సినిమా చూశాక అందరూ ‘కిష్కింధపురి 2’ ఎప్పుడని అడుగుతారు. నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది.. చాలా హ్యాపీగానూ, గర్వంగానూ ఉంది. కాకపోతే, కొంచెం వెలితి కూడా ఉంది. అది ‘కిష్కింధపురి’తో తీరుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాను బ్రహ్మాండమైన సక్సెస్ చేయాలని అందరినీ కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది