Kaantha Postponed
ఎంటర్‌టైన్మెంట్

Kaantha: ‘కాంత’ విడుదల వాయిదా.. టీమ్ ఏం చెప్పిందంటే?

Kaantha: రానా దగ్గుబాటి (Rana Dabbubati) స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వేఫేరర్ ఫిల్మ్స్, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) భాగస్వామ్యంలో.. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీ లింగ్వెల్ ఫిల్మ్ ‘కాంత’ (Kaantha). దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అప్పుడెప్పుడో అధికారికంగా ప్రకటించారు. కానీ, ప్రమోషన్స్ మాత్రం నిర్వహించలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సినిమా వాయిదా వేయడానికి కారణం ఏంటో కూడా మేకర్స్ చెప్పారు.

Also Read- Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!

మెరుగైన అనుభూతి ఇవ్వాలనే..

ఈ మేరకు వారు విడుదల చేసిన లేఖలో.. ‘‘మా ప్రియమైన ప్రేక్షకులందరికీ.. ‘కాంత’ టీజర్ విడుదలైన రోజు నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, మద్దతు మమ్మల్ని ఎంతో హత్తుకుంది. అది మాకు చాలా విలువైనది. మా చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతి ఇవ్వాలని అనుకుంటున్నాం. ‘కొత్త లోక’ ఘన విజయంతో, చంద్ర బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అదే ఉత్సాహంతో, మిమ్మిల్ని మరో అద్భుతమైన సినీ ప్రయాణంలోకి తీసుకెళ్లే ప్రత్యేక అనుభూతిని మేము సిద్ధం చేస్తున్నాం. ఆ దృష్ట్యా, మా చిత్రం ‘కాంత’ విడుదల వాయిదా పడిందని మీకు తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. అంత వరకు మాకు ఇలానే అండగా నిలుస్తారని ఆశిస్తున్నాము. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము.. ఇట్లు, టీమ్ కాంత’’ అని పేర్కొన్నారు.

Also Read- Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

ఆ రూమర్స్‌కు చెక్

ఈ వివరణతో చాలా అనుమానాలకు మేకర్స్ తెరదించారు. ఈ మధ్య అసలు ఈ సినిమా ఉందా? ఆగిపోయిందా? అనేలా కూడా కొందరికి డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే, సెప్టెంబర్ 12 అని చెప్పి, అసలు ఎటువంటి హడావుడి చేయకపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందేమో.. నెటిజన్లు కొందరు భావించారు. అందులోనూ హీరోయిన్‌కు కూడా సరైన సక్సెస్ పడటం లేదు. అందానికి అందం ఉన్నా.. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మనుగడ కష్టం కాబట్టి.. మళ్లీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారేమో అని మరికొందరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో.. మేకర్స్ స్పందించి.. అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టేవారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kavitha: కవితను కలిసిన కేసీఆర్ సొంతూరి ప్రజలు.. ఎందుకో తెలుసా?

Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్

YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!