Ankith Kollya and Nilakhi Patra
ఎంటర్‌టైన్మెంట్

Beauty Teaser: ‘బ్యూటీ’.. ఓ స్కూటీ ప్రేమకథ.. లైఫ్‌లో ఇంకేం వద్దు!

Beauty Teaser: అంకిత్ కొయ్య.. ఈ కుర్ర హీరో పేరు ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా వినబడుతోంది. ‘ఆయ్’, ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రాల తర్వాత అంకిత్ ఇప్పుడు సోలో హీరోగా చేస్తున్న సినిమా ‘బ్యూటీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్‌గా విడుదలై వైరల్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌ నీలఖి పాత్రతో లిప్‌లాక్ చేస్తున్నట్లుగా వచ్చిన ఈ పోస్టర్‌.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది. ఈ కుర్రహీరో ఏంటి? ఇలా లిప్ లాక్స్ చేస్తున్నాడేంటి? అనేలా ‘బ్యూటీ’ ఫస్ట్ లుక్‌పై చర్చలు నడిచాయి. వాలెంటైన్స్‌డే పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ని కూడా వదిలారు. ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా.. ఓ మంచి ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలియజేసింది.

Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

ఈ టీజర్.. పేరుకు తగ్గట్టుగానే ఎంతో బ్యూటీఫుల్‌గా, ఎంతో ప్లెజెంట్‌గా ఉంది. ఓ బ్యూటీఫుల్ ప్రేమ కథ ఇందులో ఉందని, అలాగే మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అర్థమవుతోంది. ఈ టీజర్‌లో అంకిత్ కొయ్య, నీలఖి పాత్రలతో పాటు తండ్రిగా నరేష్, తల్లిగా వాసుకి పాత్రల్ని కూడా పరిచయం చేశారు. ఓ స్కూటీ చుట్టూ తిరిగే ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. స్కూటీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? ఈ స్కూటీ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి.. అనే ఇంట్రస్టింగ్ ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను మేకర్స్ కట్ చేశారు. టైటిల్‌కి తగినట్లుగా టీజర్‌లో శ్రీ సాయి కుమార్ ఇచ్చిన విజువల్స్, విజయ్ బుల్గానిన్ అందించిన ఆర్ఆర్ ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌ ఈ సినిమా స్వరూపాన్ని తెలియజేస్తుంది. మొత్తంగా అయితే, ఓ మంచి ప్రేమకథగా ‘బ్యూటీ’ సినిమా ఉండబోతుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది.

మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్‌’ వంటి సినిమాను రూపొందిస్తున్న వానరా సెల్యులాయిడ్ సంస్థ.. ఈ లవ్, యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మారుతి టీం ప్రొడక్ట్‌తో భాగస్వామ్యమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంకిత్ సోలో హీరోగా వస్తున్న ఈ సినిమాపై టీజర్‌తో భారీగానే అంచనాలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!