Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. విమర్శలు చేయకండి
Bandla Ganesh attending a public event during his Sankalpa Yatra, interacting with supporters and leaders on stage.
ఎంటర్‌టైన్‌మెంట్

Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) సంకల్ప యాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే సోమవారం (జనవరి 19) సంకల్ప యాత్రను గ్రాండ్‌గా మొదలెట్టారు. ఈ యాత్ర ప్రారంభంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ యాత్ర సందర్భంగా బండ్ల గణేష్‌కు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే శంకర్, నటుడు శివాజీ (Sivaji) వంటి వారంతో సపోర్ట్‌గా నిలిచారు. ‘ఇది నా సంకల్ప యాత్ర.. రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి నేను మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర’ అని అన్నారు బండ్ల గణేశ్‌. షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు ‘సంకల్ప యాత్ర’ (Sankalpa Yatra) ప్రారంభించిన సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..

Also Read- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!

రుణం తీర్చుకోవడానికే..

‘‘ఇది కేవలం సంకల్ప యాత్ర.. రాజకీయ యాత్ర కానే కాదు. దైవ సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుందనేదానికి ఉదాహరణ ఇది. దేవుడికి నేను మొక్కుకున్న మొక్కు ఇది. ఆయన నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నా షాద్ నగర్ ప్రజలు.. అలాగే నాకు ఈ స్థాయి ఇచ్చి, నా జీవితానికి అర్థం చెప్పి, నేనున్నానని ముందుకు నడిపించిన దైవ సమానులు పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అడుగు ముందుకు వేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవిని చూడాలని హైదరాబాద్‌కు వెళ్లాను. ఈరోజు ఆయన నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. నేను పాదయాత్ర మొదలు పెడుతున్నాను ఇది భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను.

Also Read- Chiranjeevi MSG: మన ప్రసాద్ గారు ఫస్ట్ వీకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారోచ్.. వివరాలివే!

ఢిల్లీ వెళ్లి కూర్చునేవాడిని

నాకు ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే అలవాటుంది. ఆ రోజు టీవీలో చంద్రబాబు (Chandrababu Naidu) అరెస్ట్‌ వార్త చూడగానే షాకయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడమేంటని ఆశ్చర్యపోయాను. గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్‌ ఇస్తారనుకున్నాను. అలా జరగలేదు. రాజమండ్రి జైలుకు పంపించారు. రోజులు గడిచేకొద్దీ నాకు టెన్షన్‌ మొదలైంది. జైల్లో చంద్రబాబుకు ఏమన్నా అవుతుందా? అనే భయమేసింది. ప్రతిక్షణం ఆయన ఎప్పుడు బయటకు వస్తారా? అని ఎదురుచూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్‌ వచ్చిందనే వార్త మొదట వినడానికే ఢిల్లీ వెళ్లి కూర్చునేవాడిని. జైలు నుంచి ఆయన తిరిగివస్తే.. నా గడప నుంచి వెంకన్న గడపకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండలవాడిని అప్పుడే మొక్కుకున్నా. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత తెలుగు వాడి గర్వం లాగా, తెలుగు వాడి తేజస్సు లా బయటకు వస్తుంటే.. ఆయన్ని చూసిన ఉత్సాహం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయనలాంటి వ్యక్తి తెలుగు జాతికి కావాలని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోడానికి ఈరోజు పాదయాత్ర చేస్తున్నా. ఈ యాత్రను దయచేసి రాజకీయంగా చూడొద్దు. అలాగే విమర్శలు చేయవద్దని వేడుకుంటున్నాను. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నా షాద్ నగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు అభిమానం ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!

MP Chamal Kiran: దావోస్‌ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి