Renu Desai: ఇకపై హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష అనే బిల్‌పై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కుక్కలపై (Dogs) కోర్టులు ఇస్తున్న స్టేట్‌మెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వీటన్నింటిపై మాట్లాడేందుకు తాజాగా నటి రేణు దేశాయ్ (Renu Desai) ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ జర్నలిస్ట్.. కుక్కలు కరిచి పిల్లలు చనిపోతుంటే మీకేం పట్టడం లేదా? అంటూ కాస్త బిగ్గరగా అరవడంతో.. రేణు దేశాయ్ కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. దోమ కాటుతో డెంగ్యూ వచ్చి ఎంతో మంది చనిపోయారు. నాకు తెలిసిన, నాకు ఎంతో ఇష్టమైన పిల్లాడు కూడా ఈ మధ్య చనిపోయాడు. దోమలు కుట్టి చనిపోయినప్పుడు ఎవరూ మాట్లాడ లేదు కదా. ఇంకా బైక్ యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. అలా అని బైక్ సంస్థలను మూసేస్తున్నారా? అలా జరగడం లేదుగా. మరి ఒక్క కుక్క కరిచిందని అన్ని కుక్కలను ఎందుకు చంపుతున్నారు? అని రేణు దేశాయ్ ఫైర్ అయింది.
Also Read- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ సరసన నటించే తార లుక్ విడుదల.. ఎంత బావుందో!
అప్పుడేమవుతుంది మీ మగతనం
ఇంకా ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లల మీద హత్యాచారం చేసిన వాడిని ఎందుకు చంపడం లేదు. నేను కుక్కల గురించి, మేకల గురించి మాట్లాడడానికి ఇక్కడకు రాలేదు. చిన్న పిల్లల్ని హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. అప్పుడేమవుతుంది మీ మగతనం.. మీరు మగాళ్లు కాదా? అప్పుడేందుకు లా ను మీ చేతుల్లోకి తీసుకోవడం లేదు. ఒక కుక్క ఒక చిన్నబిడ్డని కరిచి చంపితే.. అందరూ వచ్చి కుక్కలన్నింటిని చంపుతున్నారు. అదే ఒక చిన్నపిల్లపై ఒక మృగం లాంటి వాడు హత్యాచారం చేసి చంపితే.. అతన్ని ఎందుకు చంపడం లేదు. ఆ చిన్న బిడ్డ ప్రాణం ప్రాణం కాదా? కుక్క కరిచిన చిన్నబిడ్డదే ప్రాణమా? మీ పక్క ఇంట్లో తాగి వచ్చి పెళ్లాం, పిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా కొడుతుంటారు. పక్కనున్న వాళ్లంతా నోరు మూసుకుని కామ్‌గా ఉంటారు. మనకెందుకు, వారి పర్సనల్ లైఫ్ అని అంటారు కదా.. అప్పుడేమైంది మీ హ్యుమానిటి. అప్పుడేమైంది మీ మగతనం, అప్పుడేమైంది మీ జస్టిస్. సెలక్టివ్ వాటికే జస్టిస్ అని ఎందుకు వాడుతున్నారు. డ్రంక్ డ్రైవ్‌లో ఒక చిన్న పిల్ల చనిపోతే.. ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాపుని మూసివేసే దమ్ము మీకుందా? అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. రేణు దేశాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవడమే కాకుండా, ఆమెపై ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ‘నువ్వు ఇలాంటి దానివనే.. నిన్ను పవన్ కళ్యాణ్ వదిలేశాడు, నీ బిడ్డలను కుక్కలు కరిస్తే తెలుస్తుంది’ అంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో రేణు దేశాయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన రేణు దేశాయ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది.
Also Read- VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15వ మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ అదిరింది
ఆ నీచపు కామెంట్స్ ఆపండి ప్లీజ్..
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నాకు జలుబు, జ్వరంతో గొంతు పోయింది. పెద్దగా చెప్పలేకపోతున్నాను. డాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేను మాట్లాడిన వాటిపై వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. నేను ఏ పార్టీలోకి చేరడం లేదు. నా ఎన్జీఓతో చాలా హ్యాపీగా ఉన్నాను. నాకసలు రాజకీయాలంటేనే నచ్చదు. దయచేసి అలాంటి రూమర్స్‌ని వ్యాపింపచేయవద్దు. ఇంకోటి నేను ఏ మీడియా పర్సన్ మీదా అరవలేదు. అతను ఏ విధంగా అయితే మాట్లాడాడో.. నేను కూడా అదే విధంగా సమాధానం ఇచ్చాను. అతనే అరుస్తూ వచ్చాడు. మమ్మల్ని కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇంకోటి నా పర్సనల్ లైఫ్ గురించి ట్రోల్ చేస్తున్నారు. తనకి తిక్క ఉంది.. అందుకే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వదిలేశాడు అంటూ థంబ్‌నైల్స్ పెడుతున్నారు. నేను కుక్కల కోసం కాదు పోరాడేది. హ్యూమన్ లైఫ్ కోసం పోరాడుతున్నాను. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడుతుంటే, మీరు నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకి కుక్క కరిచి, నీ పిల్లలు చనిపోతే తెలుస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. నా బిడ్డ ప్రాణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేనూ ఒక అమ్మనే. ఎవరి బిడ్డ ప్రాణం పోయినా అది బాధే. ఆ బాధ నాకూ ఉంటుంది. అందుకే చెబుతున్నాను.. మీ ప్లేస్‌లో అగ్రెసివ్ కుక్క ఉందని చెప్తే కొన్ని గంటల్లోనే ఆ అగ్రెసివ్ కుక్కని తీసుకెళ్లేలాగా నేను చూసుకుంటాను. నన్న కాంటాక్ట్ చేస్తే చాలు.. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను. అంతేకానీ, దీని కోసం నా పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్ చేస్తూ, బూతులు తిడుతూ, నా బిడ్డల గురించి మాట్లాడవద్దు ప్లీజ్..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

