NBK112(IMAGE SOURCE :X )
ఎంటర్‌టైన్మెంట్

NBK 112: మరో సారి వారి కాంబినేషన్ రిపీట్!.. ఈ సారి హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్

NBK 112:నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిసి కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేనితో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే బాలకృష్ణకు క్రిష్ వినిపించగా ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ కథతో దర్శకుడు ముందు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తే అనివార్యకారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చి్ందట. తర్వాత ఈ కథను బాలయ్య ఓకే చేశారని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రాగా అది కథ పరంగా బాగున్నా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అయితే ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ దండిగా ఉండేలా చూసుకున్నారని టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం దర్శకుడు ఎక్కడా ప్రకటించలేదు.

Read also- Priya Sachdev: 30,000 కోట్ల ఆస్తి వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ పేరు, బయోను మార్చిన సంజయ్ కపూర్ భార్య

క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం అనుష్కతో ‘ఘాటి’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గంజా మాఫియా నేపథ్యంలో సాగుతుంది. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 2025లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ‘ఆదిత్య 369’ కు కొనసాగింపుగా ఉంటుందా.. లేదా శాతకర్ణికి కొనసాగింపుగా ఉంటుందా అనేది మాత్రం సమాచారం లేదు. అయితే వీరిద్దరి కాంబోలో రాబోయేది మాత్రం శాస్త్రీయ ఫాంటసీ చిత్రం అని మాత్రం తెలుస్తొంది. ఇది క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడవ సినిమా కానుంది. మూడేళ్ల విరామం తర్వాత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న భారీ అంచనాలే ఉన్నాయి.

Read also- Noida Crime: వీధి కుక్క విషయంలో గొడవ.. జర్నలిస్టుకు 8 కత్తిపోట్లు.. మ్యాటర్ ఏంటంటే?

నందమూరి బాలకృష్ణ ఇటీవల విడుదలైన “దాకు మహారాజ్” సినిమాలో తన నటనతో మరోసారి మెప్పించారు. ప్రస్తుతం ఆయన “అఖండ 2 తాండవం” సినిమా షూటింగ్‌లో ఉన్నారు, ఇది 2025 దసరాకు విడుదల కానుంది. అంతేకాక “NBK111” పేరుతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాకు కమిట్ అయ్యారు. అలాగే రజనీకాంత్ “జైలర్ 2” సినిమాలో బాలయ్య స్పెషల్ క్యామియో చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తం మీద బాలయ్య మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం