Ellamma Movie: కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి వేణు. బలగం సినిమాకు దర్శకుడిగా మంచి విజయం అందుకున్నారు. కమెడియన్ వేణు నుంచి అతని పేరు బలగం వేణుకి మారిందంటే ఆ సినిమా అతని జీవితంలో ఎంతటి ఇంపేక్ట్ చూపించింతో అర్థమవుతుంది. అయితే తాజాగా ఆయన రెండో సినిమా కూడా ఎస్వీసీలోనే ఉండబోతుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఎంతో మంది హీరోలు మారగా చివరికి సంగీత దర్శకుడు దేవీశ్రీ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా టైటిల్ కూడా ఎల్లమ్మ అని ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నాడు దర్శకుడు. దీనిని నిర్మాత దిల్ రాజు బ్యానర్ అయిన ఎస్వీసీ అధికారిక ట్విటర్ ద్వారా తెలిపారు. బలగం లాంటి సినిమా తర్వాత ఎల్లమ్మ ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్ కి ఇది గుడ్ న్యూస్.
Read also-Chiranjeevi Premier: బాలయ్య బాబు రికార్డును బ్రేక్ చేసిన మెగాస్టార్.. ఎందులోనంటే?
మట్టిలోంచి పుట్టిన కథ..
గత కొన్నేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ‘బలగం’ ఒకటి. ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, ప్రతి ఇంటా ఒక భావోద్వేగంగా మారింది. తెలంగాణ సంస్కృతిని, మట్టి వాసనను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించారు ఈ సినిమా దర్శకుడు. తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలోని ఒక పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక ఇంటి పెద్ద అయిన కొమురయ్య ఆకస్మిక మరణంతో కథ మొదలవుతుంది. ఆయన మరణం తర్వాత జరిగే పదకొండు రోజుల కర్మకాండల చుట్టూ దర్శకుడు కథను అల్లారు. మనిషి బతికున్నప్పుడు పట్టించుకోని బంధువులు, చనిపోయాక చేసే ఆచారాల చుట్టూ ఉన్న డొల్లతనాన్ని, పట్టింపులను ఈ చిత్రం ఎండగట్టింది.
Read also-Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా
చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలంటే కాకి పిండాన్ని తాకాలి అనేది మన నమ్మకం. ఈ సినిమాలో కాకి ముద్ద ముట్టకపోవడం అనే అంశం ద్వారా విడిపోయిన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఇగోలను, ద్వేషాలను దర్శకుడు అద్భుతంగా చూపించారు. నటీనటుల వేషధారణ నుండి, వారు మాట్లాడే యాస వరకు అంతా చాలా సహజంగా ఉంటుంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ తమ పాత్రల్లో ఒదిగిపోగా, కొమురయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి ప్రాణం పోశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు వెన్నెముక. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే పాట ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ‘బలగం’ సినిమా కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో గ్రామస్థులందరూ కలిసి ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకుని ఈ సినిమాను చూశారు. విడిపోయిన ఎందరో అన్నదమ్ములు, బంధువులు ఈ సినిమా చూసి ప్రభావితమై మళ్లీ కలిసిన సందర్భాలు వార్తల్లో నిలిచాయి.

