Prabhas Emotion: పాన్ ఇండియా స్టర్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు విడుదల చేసిన ఒక వీడియోలో ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూపిస్తుంది. అందులో ప్రభాస్ ఎమోషనల్ యాంగిల్ లో చూపిస్తారు. ప్రభాస్ నియినమ్మ ఆసుపత్రి బెడ్ పై ఉండగా రెబల్ స్టార్ పండించిన ఎమోషన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ‘చంపేస్తాడే నిన్ను లేవవే ఈ రోజు అమావాస్య రోజే లేవవే’ అంటూ ప్రభాస్ నానమ్మ కాళ్లపై పడి ఏడుస్తున్న 20 సెకండ్ల సీన్ అందరి కంటా ఒక్క సారి కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రభాస్ నట విశ్వ రూపాన్ ఈ సీన్ ఒక్క దాంట్లోనే చూపించేందుకు నిర్మాతలు ఈ ప్రోమో వదిలారు. తాజాగా ఈ సీన్ తెగ వైరల్ అవుతోంది.
Read also-Ellamma Movie: బలగం వేణు రెండో సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎకంగా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ రూ.201 కోట్లు దాటేసింది. తాజాగా ఈ కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు నిర్మాతలు. అందులో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.201 కోట్లు వసూలు చేసినట్లుగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొదట ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ లో సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని దర్శకుడు థ్యాక్స్ మీట్ లో చెప్పుకొచ్చారు. అన్నట్లు గానే ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు రాబట్టేటట్లు కనిపిస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో నార్త్ కలెక్షన్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లు వసూళ్లు చేస్తుందో చూడాలి మరి.
Read also-Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?
సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా మూవీ టీం థ్యాక్స్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సినిమా అభిమానులకు నచ్చింది అని నేను అనుకోను, అసలు నచ్చలేదు అని కూడా అనుకోను ఎందుకంటే.. సినిమా డిఫరెంట్ జోనర్ లో తీయడం వల్ల కొంత మందికి అర్థం అయిఉండదు. అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి. అర్థం చేసుకుంటే.. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక రోజులు ప్రక్షకులకు ఎక్కేది కాదు కొంచెం టైం అడుతోంది. పది రోజుల తర్వాత చూడండి సినిమా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా నచ్చుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా కొంత మందికి అసలు అర్థం కాలేదని అందుకు చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని, సినిమా చూసి చాలా మంది నాకు కాల్ చేసి చాలా బాగుందని చెప్పారన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ మొదటి రోజు రూ.112 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఈ సినిమా నాలుగు రోజుకలు గాను రూ.201 కోట్లకు పైగానే వసూలు చేసింది.
Hospital sequences that the audience can’t get enough of ❤️#Prabhas hits hard with a performance that leaves everyone emotional 🥹🫶🏻#BlockbusterTheRajaSaab #TheRajaSaab @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/CHSZAsLAbn
— People Media Factory (@peoplemediafcy) January 13, 2026

