Chiranjeevi Premier: బాలయ్య బాబు రికార్డును బ్రేక్ చేసిన మెగాస్టార్..
balayya-chiru
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi Premier: బాలయ్య బాబు రికార్డును బ్రేక్ చేసిన మెగాస్టార్.. ఎందులోనంటే?

Chiranjeevi Premier: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోల వసూళ్లలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ స్థాయిలో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా దాదాపు రూ.24 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. గతంలో ‘అఖండ 2’ పేరిట ఉన్న ప్రీమియర్ రికార్డులను ఈ చిత్రం సునాయాసంగా దాటేసింది. దీనితో టాలీవుడ్ సీనియర్ హీరోల చిత్రాలలో అత్యధిక ప్రీమియర్ వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది.

Read also-Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నయనతార ముఖ్య పాత్రలో నటించారు. విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో మెరిశారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ కలగలిసి ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చిరంజీవి తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ

మొదటి రోజు కలెక్షన్లు..

టాలీవుడ్ మెగాస్టార్ మరోసారి సినిమా పరిశ్రమకు తన సత్తా ఏమిటో చూపించారు. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.84 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగా భారీ వసూళ్లు కూడా రాబడుతోంది. దీంతో నిర్మాతల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ మొదటి రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ స్థాయి వసూళ్లు రావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన ఫీట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. దాదాపు అన్ని సెంటర్లలో ‘ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్’ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ, పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు కూడా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

Just In

01

Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?

Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

Germany Good News: భారతీయులకు జర్మనీ గుడ్‌న్యూస్.. ఇకపై వీసా లేకుండానే కీలక సర్వీసు

Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా

GHMC: గ్రేటర్‌లో ఈ-వేస్ట్ మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం.. ఐటీ ప్రాంతాల, ఆ షాపులపై జీహెచ్ఎంసీ ఫోకస్!