Balagam Venu: ‘బలగం’ సినిమా తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు తాజాగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తో ‘ఎల్లమ్మ’ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలయింది. తాజాగా షూటింగ్ లో భాగంగా ఓ పురాతన ఆలయం పైకి ఎక్కి వేణు ఫోటో దిగారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది చూసిన హిందూ సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి. ఎందుకంటే పురాతన ఆలయం పైకి షూతో ఎలా ఎక్కుతారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఎల్లమ్మ వేణు అపచారం చేశాడంటూ హిందూ సంస్థలు ఆయనపై మండి పడుతున్నాయి. దీనిని చూసిన కొందరు ఆయన మద్దతు దారులు కరెంట్ తీగల మధ్య షూటింగ్ సాగుతున్న కారణంగా షూ తప్పని సరి అయి ఉంటుందని వారు సమర్థిస్తున్నారు. దీనిపై వేణు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
Read also-Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు.. ఎందుకంటే?
‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ ‘పార్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. వీడియోలో చూపించిన విజువల్స్, ముఖ్యంగా గొర్రెలు, ప్రకృతి నేపథ్యం, దేవి శ్రీ ప్రసాద్ రగ్గడ్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. వర్షంలో సాగే సన్నివేశాలు గ్లింప్స్ చివరలో చూపించిన ఇంటెన్స్ షాట్స్ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉండబోతుందో సూచిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్, నటుడిగా ఈ చిత్రంతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also-Peddi Special Song: ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్.. ఎవరంటే?

