Peddi Special Song: రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్ గ్లోబల్ లెవెల్ లో హిట్ సాధించాయి. అయితే తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి టాప్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సిద్ధమయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో టాప్ హీరోయిన్ మృణాల్ స్పెషల్ సాంగ్ చేయబోతుండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అందించిన ‘చికిరీ చికిరీ’ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ రానుండటంతో ఇది కూడా పూజ హెగ్డే రంగ స్థలం సినిమాలో చేసి ‘జిగేలు రాణి’ లాంటి హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సాంగ్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Read also-Sasirekha Video Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ‘ఓ శశిరేఖా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి

