Bad Girlz Movie Promotions: తెలుగు సినిమా బ్యాడ్ గర్ల్స్ మూవీ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మున్నా ధూళిపూడి డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బోల్డ్, ఆకర్షణీయమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బ్యాడ్ గర్ల్స్ టైటిల్ మోషన్ పోస్టర్
బ్యాడ్ గర్ల్స్ టైటిల్ మోషన్ పోస్టర్ ఆగస్టు 6, 2025న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో ప్రముఖ దర్శకులు చందు మొండేటి, శివ నిర్వాణ , కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరై, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో ఉత్సాహభరితమైన డాన్స్ ప్రదర్శనలు జరిగాయి. వీటిని X పోస్ట్‌లలో షేర్ చేయడం వలన బాగా వర్ల్ వైరల్ అయ్యాయి. దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ.. సినిమా సందేశాత్మక కథను గురించి వివరించారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే సందేశాన్ని నొక్కిచెప్పారు. “కానీ చాలా మంచోళ్లు” అనే ట్యాగ్‌లైన్ ఈ బోల్డ్ టైటిల్ వెనుక ఉన్న భావోద్వేగ లోతును చూపించింది.
Also Read: Akhanda 2 Update: అఖండ 2: తాండవం- డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే..
ప్రెస్ మీట్‌లో నటీనటులు, టెక్నీకల్ బృందంతో ఇంటరాక్షన్స్ జరిగాయి. దీనిలో ఇందులో నటీనటులు అంచల్ గౌడ్, పాయల్ చెంగప్ప, రోషిణి, యశ్న్, అలాగే కీలక నటులు రోహన్ , సూర్య ఉన్నారు. సినిమా షూట్ చేసేటప్పుడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి, మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలలో షూటింగ్ చేయడం వంటి వాటిని చెప్పారు.
దర్శకుడు మున్నా కొత్త నటీనటులు ఎంచుకోవడంలో తీసుకున్న రిస్క్ గురించి తెలిపారు. పెద్ద నిర్మాతలు కొత్త ముఖాలతో మార్కెట్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేయడంతో, తన స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలు ఎక్కించునట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఆస్కార్ విజేత గీత రచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యంతో, ప్రమోషన్‌లో కీలక అంశంగా ఉంది. టైటిల్ లాంచ్ తర్వాత 10 రోజుల్లో విడుదల కానున్న ప్రీ-వెడ్డింగ్ సాంగ్ పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.
ఈ చిత్ర ప్రమోషన్స్ అన్ని సినిమాల కంటే కొత్తగా ట్రై చేశారు. నలుగురు హీరోయిన్లు మాస్క్ లు వేసుకుని స్టేజ్ మీదనే, అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి వాళ్ళ రియాలీటీని చూపించారు. అక్కడున్న జర్నలిస్టులు కూడా షాక్ అయ్యారు. ఇది నెక్స్ట్ లెవెల్ అసలు… పబ్లిసిటీ చేసేది వాళ్లే.. కాంట్రవర్సీ చేసేది వాళ్లే.. సినిమాల్లో ఉన్నటువంటి జెన్యూన్ ఎప్పుడో పోయింది మాస్టారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు