Bad Boy Karthik
ఎంటర్‌టైన్మెంట్

Bad Boy Karthik Film: ‘నా మావ పిల్లనిత్తానన్నాడే.. గుర్రమింక ఎక్కుడే’.. మరో కుర్ర హీరోయిన్‌తో నాగశౌర్య రొమాన్స్!

Bad Boy Karthik Film: యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యారు. పవర్ ఫుల్ టైటిల్స్‌తో వరుసగా సినిమాలు చేసినా, ఆయనకు ఏ ఒక్కటీ కలిసి రాలేదు. అందుకే కాస్త ఆలోచించి దిగాలని ఆయన విరామం తీసుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్. ఆగస్ట్ 8, శుక్రవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘నా మావ పిల్లనిత్తానన్నాడే’ (Naa Maava Pillanitthaanannade lyrical video) అంటూ వచ్చిన ఈ సాంగ్, కుర్రాళ్లతో డ్యాన్స్ చేయించేలా ఉంది. ఇద్దరు ప్రేమికులు హుషారుగా డ్యాన్స్ చేస్తూ హమ్మింగ్ చేసుకునేలా పాటను పిక్చరైజ్ చేశారు.

Also Read- Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..

ఈ పాటకు నేషనల్ అవార్డ్ విన్నర్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యం అందించగా, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జైరాజ్ (Harris jayaraj) స్వరాలు సమకూర్చారు. చాలా గ్యాప్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జైరాజ్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఒకప్పుడు ఆయన మ్యూజిక్‌‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా వచ్చిన ‘ఆరంజ్’ చిత్రానికి హరీస్ జైరాజ్ ఇచ్చిన పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్స్‌‌ లిస్ట్‌లో ఉండటం విశేషం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చిన పాట కావడంతో.. ఈ పాటపై నార్మల్‌గానే అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఈ పాటను చాలా గ్యాప్ తర్వాత కారుణ్య ఆలపించారు. హరిప్రియ ఫిమేల్ సింగర్. తన మామ కూతురుని మనువాడడానికి హీరో.. ఎనర్జిటిక్‌గా రెడీ అవుతుంటే.. అంత సామాన్యంగా నీకు దక్కనని హీరోయిన్, హీరోని టీజ్ చేస్తుంది. హీరోయిన్‌పై హీరో తన ప్రేమను, పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేస్తూ.. ఆమె కోసం ఏమేం చేస్తాడో చెబుతున్న విధంగా కాసర్ల శ్యామ్ ఈ పాటను రచించారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Mayasabha Review: దేవా కట్టా ‘మయసభ’ వెబ్ సిరీస్ రివ్యూ

శ్రీమతి సుజాత మేడికొండ, బేబి అద్వైత అండ్ భవిష్యల సమర్పణలో శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాటకు విజయ్ పోలాకి కొరియోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. ముఖ్యంగా స్టెప్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. తన ప్రతి సినిమాలో ఓ కొత్త భామను పట్టుకొచ్చే నాగశౌర్య.. ఈ సినిమాలోనూ కుర్ర హీరోయిన్ విధి యాదవ్‌తో రొమాన్స్ చేస్తుండటం. ఈ పాటలో రొమాంటిక్ స్టెప్స్‌కు లోటు లేదు. కుర్రాళ్లకు మాత్రం మంచి ట్రీట్ అనేలా ఉందీ సాంగ్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!