bahubali
ఎంటర్‌టైన్మెంట్

Baahubali The Epic Collections Day 2: ‘బాహుబలి: ది ఎపిక్’ రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Baahubali The Epic Collections Day 2: దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ మళ్లీ తెరపైకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. అయితే, మళ్లీ దీనిని ‘Baahubali: The Epic’ గా మన ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా అంచనాలను మించి సత్తా చాటుతూ, విమర్శకులకు కూడా గట్టి సమాధానం చెప్పింది.

ప్రభాస్, రాణా దగ్గుబాటి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. విడుదలైన మొదటి రోజే 10 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాల నుండి చూడని సన్నివేశాలు, కొత్తగా ఎడిట్ చేసిన సీక్వెన్స్‌లతో మన ముందుకొచ్చింది.

Also Read: Vishnupriya: బిగ్ బాస్ కి వెళ్లినందుకు తనకు తానే తిట్టుకున్నానని సంచలన కామెంట్స్ చేసిన యాంకర్ విష్ణుప్రియ

రెండో రోజు కలెక్షన్స్?

అమెరికా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యుఎఇ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా విడుదలై భారీ హైప్ క్రియోట్ చేసింది. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాసర్, రమ్యకృష్ణన్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెర్షన్ నిడివి దాదాపు 4 గంటలు ఉండటం విశేషం. విడుదలకి ముందు నుంచే 1 కోటి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ రాబట్టిన ‘బాహుబలి: ది ఎపిక్’, విడుదలైన కొన్ని గంటల్లోనే 3 కోట్లకుపైగా వసూలు చేసింది. మొదటి రోజ ముగిసే సమయానికి రూ. 9.65 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 16 కోట్లు వసూలు చేసింది.

Also Read: Illegal Land Surveys: దళిత రైతుల భూములపై అక్రమ సర్వేలు.. ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  రెండో రోజు (శనివారం) కొద్దిగా తగ్గినప్పటికీ , రాత్రి షోలలో ఆక్యుపెన్సీ పెరిగి, సినిమా సత్తా చాటింది. సినీ  వర్గాల సమాచారం ప్రకారం, రెండో రోజు ఈ చిత్రం రూ. 7 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం కలెక్షన్ రూ. 17.80 కోట్లకు చేరుకుంది. ఈ వేగం చూస్తుంటే త్వరలోనే 20 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 357 షోలలో 63% ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరులో 149 షోలలో 62% సీట్లు నిండాయి. తమిళనాడులో కూడా ‘బాహుబలి: ది ఎపిక్’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చెన్నై, కోయంబత్తూరులో 40% పైగా ఆక్యుపెన్సీతో సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.

Also Read: Mallujola Venugopal: ప్రస్తుత పరిస్థితుల్లో లొంగి పోవాల్సి వచ్చింది.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్య పనిచేయాలనే సంకల్పం!

టాలీవుడ్‌లో మళ్లీ ‘బాహుబలి’ కొత్త రికార్డ్ 

అర్కా మీడియా పతాకం పై రూపొందిన ఈ రీ-రిలీజ్ టాలీవుడ్‌లో మళ్లీ హవా సృష్టిస్తోంది. తాజా తమిళ బ్లాక్‌బస్టర్స్ ‘డ్యూడ్’ (ప్రదీప్ రంగనాథన్), ‘బైసన్’ (మారి సెల్వరాజ్) వంటి సినిమాలకూ గట్టి పోటీ ఇస్తోంది. వారాంతంలో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Just In

01

Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?

Big TV Vijay Reddy: బిగ్ టీవీ అధినేత పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమానికి చేయూత

Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’.. మరో అప్డేట్ వచ్చేసింది

World Cup Fianal: ఫైనల్‌లో అమ్మాయిల అద్భుత బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్

Jangaon District: స‌ర్కారు భూమిలో ఎర్ర‌జెండాలు.. జనగామ జిల్లాలో సీపీఐఎం నేతల దూకుడు