Chandrahass Trolls: పాపం యాటిట్యూడ్ స్టార్‌కు ఎంత కష్టం..
Chandrahass-Trolls
ఎంటర్‌టైన్‌మెంట్

Chandrahass Trolls: పాపం యాటిట్యూడ్ స్టార్‌కు ఎంత కష్టం.. ఈటీవీ ప్రభాకర్ కొడుకు కాకుంటే?

Chandrahass Trolls: చంద్రహాస్ అంటే బహుశా టాలీవుడ్ లో ఎవరికీ తెలియక పోవచ్చు.. కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే మాత్రం దాదాపు అందరూ గుర్తిస్టారు.. అది కూడా ఈ టీవీ ప్రభాకర్ కొడుకు అని. తాజాగా చంద్రహాస్ బరాబర్ అనే సినిమాతో ఫిబ్రవరి 6 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఓ ప్రమోషన్ ఈవెంట్ లో యాటిట్యూడ్ స్టార్ అన్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చంద్రహాస్ మాట్లాడుతూ.. తాను ఈటీవీ ప్రభాకర్ కొడుకు కాకుంటే ఈ పాటికి ఏదో విధంగా చిన్నా, పెద్దో సినిమాలు చేసేవాడిని ఆయన కొడుకు అవ్వడం వల్లే తనను ఇలా ట్రోల్ చేస్తున్నారని అందుకు ఎదగలేక పోతున్నానంటూ చంద్రహాస్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంలో ఆయన స్పందించారు. ఆ సందర్భంలో అన్నది అంతా నిజమేనని కానీ పూర్తి వీడియో చూస్తే దీనిపై క్లారిటీ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Read also-Gandhi Talks Trailer: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ వచ్చేసింది చూశారా.. మాటల్లేవ్ భయ్యా..

వైరల్ అయిన వీడియో తర్వాత యాటిట్యూడ్ స్టార్ స్పందించాడు.. వీడియో గురించి మాట్లాడుతూ.. ఆ విధంగా అన్నది తాను కాదని, అదంతా ఏఐ ద్వారా చేశారని అసలు వీడియో ఇదిగో అంటూ తన దగ్గర ఉన్న వీడియోను చూపించారు.  అందుతో తనను ఎలా పిలిచినా పలుకుతానని, యాటిట్యూడ్ స్టార్ అన్నా .. ఈ టీవీ ప్రభాకర్ కొడుకు అన్నా.. రామ్ నగర్ బన్నీ అన్నా, చంద్ర హస్ అన్నా పలుకుతానని కానీ పిలుపులో అభిమానం ఉంటే చాలా ఇష్టం అని అన్నారు. అంతే కాకుండా  ఈ ఫేమ్ అంతా తన తండ్రి నుంచి వచ్చిందని, తనను ఈ టీవీ ప్రభాకర్ కోడకు అంటే చాలా సంతోషంగా ఉంటుందని, అలాంటి అదృష్టం చాలా తక్కువ మందికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. దీనిని కూడా యాటిట్యూడ్ స్టార్ ప్రమోషన్ కోసం వాడుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో ఏది, నిజమో అబద్దమో అన్నది ప్రేక్షకుల్లో గందర గోళాన్ని సృష్టిస్తోంది.

Read also-Anasuya Controversy: యాంకర్ అనసూయకు గుడి కడతానంటున్న వీరాభిమాని.. ఎక్కడంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?