Gandhi Talks Trailer: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇది సంభాషణలు లేని ఒక నిశ్శబ్ద చిత్రం కావడం విశేషం. ఆధునిక కాలంలో ఇటువంటి ప్రయోగం చేయడం చాలా అరుదు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వ వహిస్తున్ప ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మాటలు లేని ఈ సినిమాలో సంగీతం అత్యంత ప్రధాన పాత్ర పోషించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా 30 జనవరి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోషల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై విజయ్ సేతుపతి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘వారు నిశ్శబ్దంగా ప్రేమించారు, నిశ్శబ్దంగా తప్పులు చేశారు, నిశ్శబ్దంగా బాధపడ్డారు’ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు. మాటలు లేని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం రూపొందించబడింది.
Read also-Balakrishna Style: ఈసారి బాలయ్య లెక్క తప్పింది.. రజనీకాంత్ స్టైల్లో చేయబోయి.. చివరికి!
ఈ సినిమాకు దర్శకుడు ఎంపిక చేసుకున్న నటీనటుల ఎంపికే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. తన కళ్లతోనే కవితలు రాసే విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఈ సైలెంట్ ఫిల్మ్‌లో తన నటనతో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక అరవింద్ స్వామి (Arvind Swami) క్లాసిక్ లుక్‌తో, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో హైలెట్‌గా నిలిచారు. ఇంకా అదితి రావు హైదరి (Aditi Rao Hydari), సిద్ధార్థ్ జాధవ్.. తమ పాత్రల ద్వారా కథకు మరింత లోతును చేకూర్చారు. డైలాగులు లేకుండా కేవలం హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం అనేది ఒక పెద్ద సవాలు వంటిది. కానీ ఇందులోని అందరూ అద్భుతంగా ఆ సవాలును స్వీకరించినట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం, సంప్రదాయ సినిమాల హద్దులను చెరిపివేస్తోంది. క్యోరియస్ డిజిటల్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ భారీ ప్రయోగాన్ని నిర్మించాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, థియేటర్లో ప్రేక్షకులు అనుభవించబోయే ఒక అరుదైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. జనవరి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

