Balakrishna Style: రజనీకాంత్ అంటే గుర్తోచ్చేది స్టైల్ ఆయనలా ఎవరూ చేయలేరు. చేద్దామని ట్రై చేసిన వారు చాలా మందే ఉంటారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ రజనీ స్టైల్లో ఓ స్టంట్ ట్రై చేశారు. అది కాస్త బెడిసి కొట్టడంతో చేసేది ఏమీ లేక దానిని కవర్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఈవెంట్ కు హాజరైన బాలయ్య బాబు అక్కడికి వచ్చే సందర్భంలో కళ్ల జోడును కాల్లోకి తిప్పి జేబులో వేద్దాం అనుకున్నారు. అది కాస్తా జారి కింద పడిపోయింది. దీంతో పక్కన ఉన్న వ్యక్తి దానిని తీసి ఆయనకు అందించారు. అదే సందర్భంలో బాలయ్య దాని కోసం ఏమాత్రం వేళ్లగుండా ఎదుటి వారితో మాట్లాడుతూ బాగా కవర్ చేశారు. దీనిని సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు బాలయ్య బాబు స్టైల్ వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Chiranjeevi Movie: రికార్డ్ బ్రేక్ చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. 15 రోజుల గ్రాస్ ఎంతంటే?
రజినీకాంత్ స్టంట్ చేయబోయి కళ్లద్దాలు కిందపడేసుకున్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ pic.twitter.com/dIU40NGe6j
— Telugu Feed (@Telugufeedsite) January 27, 2026

