athadu re release (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Athadu Re Release: ఆయన ఎప్పటికీ హీరోనే.. మురళీ మోహన్

Athadu Re Release: 2005లో విడుదలైన ‘అతడు’ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన దర్శకత్వంలో రూపొందిన ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని జయభేరి ఆర్ట్స్ పతాకంపై దగ్గిరాల కిషోర్ మరియు మురళీ మోహన్ నిర్మించారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, త్రిష కృష్ణన్ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించగా, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలు ఏ. శ్రీకర్ ప్రసాద్ వహించారు. సినిమా నిర్మాణంలో నాణ్యత, కథలో సున్నితత్వం, డైలాగుల్లో బలమైన పట్టు, హాస్యం ఈ చిత్రాన్ని తెలుగులో క్లాసిక్ స్థాయికి తీసుకెళ్లాయి. ‘అతడు’ థియేటర్లలో మంచి కలెక్షన్లలో కొంత తడబడినప్పటికీ టీవీలలో అత్యధికంగా ప్రసారం అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నవారు. ఈ సందర్భంగా నిర్మాత మురళీ మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఇతర వ్యాపారాలు ఉండడం, రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ‘అతడు’ తర్వాత మరో సినిమాను నిర్మించలేకపోయాం. త్వరలోనే జయభేరి బ్యానర్‌పై మళ్లీ సినిమాలు తీస్తాం. దీన్ని రీ రిలీజ్‌ చేయాలని రెండేళ్ల నుంచి ఎంతోమంది అడిగారు. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని బిగ్‌స్క్రీన్‌పై ఎక్కువమంది చూడలేదు. టీవీల్లో చూసి చాలా బాగుందన్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు థియేటర్‌లలో చూసి ఎంజాయ్‌ చేస్తారని నాకు నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Read also- PM Modi: ప్రధాని మోదీపై తాజా ప్రజాభిప్రాయం ఇదే

యేటర్‌లో కంటే శాటిలైట్‌ రైట్స్‌ ద్వారానే లాభాలు తెచ్చింది. మీకెలా అనిపించింది?
మురళీ మోహన్‌: ఈ సినిమా పరంగా మాకు ఒక్క రూపాయి కూడా లాస్‌ లేదు. దీన్ని చూశాక సెన్సార్‌ బోర్డులోని ఒక సభ్యుడు నాకు ఫోన్‌ చేసి ప్రత్యేకంగా మాట్లాడారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉందన్నారు.

‘అతడు’లో మీరెందుకు నటించలేదు?
మురళీ మోహన్‌: నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మా ఆవిడ నాకో కండీషన్‌ పెట్టింది. ఎవరి దగ్గరకు వెళ్లి పాత్ర అడగ కూడదు అని. అందుకే ఈ సినిమాలో నేనే లేను.

రీ రిలీజ్‌లపై మీ అభిప్రాయం ఏంటి?
మురళీ మోహన్‌: గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మొదటి మూడురోజుల్లో ఎంత వసూళ్లు చేస్తే అదే కలెక్షన్‌. థియేటర్‌లలో సినిమా చూడకపోవడానికి కూడా కారణం ఉంది. హాలులో పార్కింగ్‌ ఖర్చు నుంచి పాప్‌కార్న్‌ వరకూ ప్రతిదీ మధ్యతరగతి వాళ్లకు భరించలేని విధంగా ఉంటుంది. టికెట్‌ ధరల కంటే అవే ఎక్కువగా ఉంటున్నాయి. అందకే సామాన్యులు థియోటర్ కు రాలేకపోతున్నారు.

Read also- GHMC Street Lights: స్ట్రీట్ లైట్లకు మెరుగైన నిర్వహణ…ఆరు జోన్లకు 12 వేల వీధి లైట్లు!

నాజర్‌ పాత్రకోసం శోభన్‌ బాబు’కు బ్లాంక్ చెక్‌ ఇచ్చారట నిజమేనా?
మురళీ మోహన్‌: మా బ్యానర్‌లో శోభన్ బాబు ‘ముగ్గురు మిత్రులు’ సినిమాలో నటించారు. అది పెద్ద హిట్‌. దాని తర్వాత ఆయన సినిమాల్లో నటించడం తగ్గించేశారు. ఈ సినిమాలో నాజర్‌ పాత్ర కోసం శోభన్‌ బాబు సంప్రదించాం. మా మేకప్ మ్యాన్ కు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చి శోభన్ బాబు ఇంటికి పంపించాం. రెమ్యునరేషన్‌ ఎంతైనా ఫర్వాలేదని చెప్పాం. కానీ, ఆయన అంగీకరించలేదు. ‘నేను ప్రేక్షకులకు ఎప్పటికీ హీరోగానే గుర్తుండాలి. తండ్రి, తాత పాత్రల్లో గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు