April 25th Movies: ప్రస్తుతం ఐపీఎల్ యమా జోరుగా సాగుతుంది. దీంతో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్‌ను పలకరించేందుకు ఈ వేసవికి సిద్ధంగా లేవు. వేసవి సెలవులను క్యాష్ చేసుకోవాలనే కోరిక ఇప్పుడున్న నిర్మాతలలో ఎవరిలో కనిపించడం లేదు. మీడియం, చిన్న సినిమాలు మాత్రం ఇదే అదనుగా వరసగా థియేటర్లలోకి దిగుతున్నాయి. దీంతో ప్రతి శుక్రవారం పెద్ద సినిమా లేకున్నా, ఓ నాలుగైదు మీడియం రేంజ్, చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తూనే ఉన్నాయి. ఈ వారం కూడా ‘ఓదెల 2’ (Odela 2), ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanti), ‘డియర్ ఉమ’ (Dear Uma).. ఇలా ఓ నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక వచ్చే వారం విడుదలయ్యేందుకు ఇప్పటికే రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి.
Also Read- Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్ వస్తే అణుయుద్ధాలే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్!
అవి ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam), ‘జింఖానా’ (Gymkhana) సినిమాలు. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలకు పోటీ ఇచ్చేందుకు మరో సినిమా లైన్‌లోకి వచ్చేసింది. ఏంటా సినిమా? అని అనుకుంటున్నారా? ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) మూవీ పేమ్ అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మించారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన ‘మ్యాచింగ్.. మ్యాచింగ్’ సాంగ్ కూడా చాలా మంచి ఆదరణను రాబట్టుకుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారు. ఈ విషయం ఇప్పటికి ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో మంచి కథ, కంటెంట్, యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులందరూ చూసి అదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
Also Read- Shivathmika Rajashekar: శివాత్మిక కూడా స్టార్ట్ చేసిందిగా.. అబ్బ.. ఏముందిరా బాబూ!
చిత్ర నిర్మాత అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ, కథ మీద ఉన్న నమ్మకంతో మా సినిమాను ఈ నెల 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమాతో పాటు అదే రోజు విడుదలవుతున్న సినిమాలన్నీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్, రాంమోహన్‌లకు ధన్యవాదాలు. మా ‘సూర్యాపేట్ జంక్షన్’ సినిమాను థియేటర్‌లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
