Anushka Shetty: అనుష్క బర్త్‌డే స్పెషల్.. ‘కథనార్’ ఫస్ట్ లుక్
Anushka Kathanar (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anushka Shetty: అనుష్క బర్త్‌డే స్పెషల్.. ‘కథనార్’ ఫస్ట్ లుక్ విడుదల

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి అభిమానులకు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద సర్ ప్రైజ్ వచ్చింది. ఆమె నటిస్తున్న తొలి మలయాళ సినిమా ‘కథనార్’ (Kathanar) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ‘ఘాటి’ (Ghaati) చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో, అనుష్క (Anushka Shetty) తదుపరి ఎలాంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో, ఆమె ఒక పాన్-ఇండియా మలయాళ చిత్రంలో భాగమవుతున్నట్టు అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్‌లో అనుష్క మునుపటి కంటే చాలా స్లిమ్‌గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను పట్టు పురుగుల మధ్య కూర్చుని ఉన్నట్లుగా డిజైన్ చేయడంతో, సినిమాలో ఆమె పాత్ర విభిన్నంగా, మిస్టీరియస్‌గా ఉండబోతోందనేది అర్థమవుతోంది.

Also Read- Kamal Haasan: బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్‌తో కమల్ చిత్రం

నీలా… కాలం చేత తిరిగి రాయబడిన కథ

ఈ సినిమాలో అనుష్క పోషిస్తున్న పాత్ర పేరు ‘నీలా’. పోస్టర్‌పై ‘నీలా కథ అంద‌రికి తెలిసింది కాదు. కాలం చేత తిరిగిరాయ‌బ‌డిన‌ది’ (Neela’s story is not known to everyone. It has been rewritten by time) అనే పవర్ ఫుల్ క్యాప్షన్ జోడించారు. ఈ ఒక్క వాక్యం ద్వారానే, ఆమె పాత్ర కథనంలో కీలక మలుపులకు, అంతుచిక్కని అంశాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక డార్క్ ఫాంటసీ లేదా హారర్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ చిత్రమనే విధంగా వార్తలు నడుస్తున్నాయి. ఇందులో మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, జయసూర్యల కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతోంది. ఈ చిత్రానికి రొజీన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించారు. శ్రీ గోకులం మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Also Read- IFFI 2025: ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అంతర్జాతీయ గౌరవం.. ఇండియన్ పనోరమాకు ఎంపిక

విదేశీ భాషల్లోనూ విడుదల

‘కథనార్’ కేవలం పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, పలు విదేశీ భాషల్లో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇది భారతీయ సినిమాకు, ముఖ్యంగా మలయాళ సినిమాకు ప్రపంచ వేదికపై మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. అనుష్క కెరీర్‌లో ఇది మరో ముఖ్యమైన, విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు అనుష్క ‘కల్కి 2898 AD’ చిత్రంలోనూ భాగం కానుంది, దీపిక ప్లేస్‌ను ఆమె రీ ప్లేస్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు