Anupama-Parameswaran
ఎంటర్‌టైన్మెంట్

Anupama Parameswaran: థియేటర్లలోకి ‘కిష్కింధపురి’.. సైలెంట్‌గా ఓటీటీలోకి మరో సినిమా!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అదేంటి కేవలం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) సినిమా మాత్రమేగా శుక్రవారం విడుదలైంది అని అంతా అనుకుంటున్నారు కదా. ఆమె నటించిన మరో సినిమా కూడా నేడు విడుదలైంది. కాకపోతే, థియేటర్లలో కాదు.. ఓటీటీలో. అవును, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ (Paradha) చిత్రం కూడా శుక్రవారం ఓటీటీలో సైలెంట్‌గా విడుదలైంది. ఈ సినిమా థియేటర్లలో అంతగా సక్సెస్ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ‘పరదా’ సినిమాపై అనుపమ పరమేశ్వరన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమాను అందరూ చూడాలని తెగ ప్రచారం చేసింది. అలాంటి సినిమాలను సక్సెస్ చేస్తే.. అటువంటివి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని, తను ఎంత చెప్పినా.. ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఫలితంగా ‘పరదా’ చిత్రం థియేటర్లలో భారీ పరాజయాన్ని చవి చూసింది. ఇక శుక్రవారం తను హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం పాజిటివ్ స్పందనను రాబట్టుకుని, సక్సెస్‌ఫుల్‌గానే థియేటర్లలో రన్ అవుతోంది. ఇది అనుపమకు ఆనందాన్ని కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.

Also Read- Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!

సైలెంట్‌గా ఓటీటీలోకి ‘పరదా’

‘కిష్కింధపురి’ చిత్ర ప్రమోషన్స్‌లో ఆమె జ్వరంతోనే పాల్గొంది. తను నటించిన చిత్రం విడుదల అవుతుంటే, ప్రమోట్ చేయకుండా ఎలా ఉండగలను? అంటూ ఇటీవల ప్రమోషన్స్‌లో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఆమె అలా చెప్పిన తర్వాత అందరూ ప్రశంసించారు కూడా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి హీరోయిన్లు ఉన్నారా? అంటూ ఆమెను కొనియాడారు. ఆమె కష్టానికి తగిన ఫలితం లభించినట్లుగానే ‘కిష్కింధపురి’ టీమ్ భావిస్తోంది. ఇక ‘పరదా’ విషయానికి వస్తే.. సినిమా విడుదలై 20 రోజులు కూడా కాకముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘కూలీ’ సినిమాకు సంబంధించి రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతున్న ప్రైమ్.. ఈ సినిమా విషయంలో ఎక్కడా చిన్న ప్రకటన కూడా చేయలేదు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రైమ్ వాడు కూడా ఈ సినిమాను లెక్కలోకి తీసుకోలేదా? అనేలా కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మలయాళంలోనూ అందుబాటులో ఉంది.

Also Read- Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం

‘పరదా’ స్టోరీ ఇదే..

‘పరదా’ కథ విషయానికి వస్తే.. పడతి అనే ఊరులో ప్రతి యువతి పరదా కప్పుకుని తిరగాలనే ఆచారం ఉంటుంది. ఒకవేళ ఆ పరదా కనుక ఎవరైనా తీసినట్టు తెలిస్తే.. ఆ ఊరి గ్రామ దేవతకు ఆత్మార్పణ చేసుకోవాలి. అలాంటి షరతులు ఉంటాయి. ఈ ఆచారాన్ని పాటిస్తున్న సుబ్బు (అనుపమ).. అనుకోకుండా ఈ షరతును మీరినట్లుగా ఓ ఫొటో హల్‌చల్ చేయడంతో.. ఆమె ఇబ్బందులో పడుతుంది. ఈ క్రమంలో ఆమె.. ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఏం చేసింది? ఈ జర్నీలో ఆమెకు సపోర్ట్‌గా నిలిచిన రత్న, అమిష్ట ఎవరు? అసలు పరదా లేని సుబ్బు ఫొటోని వైరల్ చేసింది ఎవరు? ఫైనల్‌గా సుబ్బు తనకి వచ్చిన ఇబ్బందిని ఎలా తొలగించుకుంది? అనేదే ఈ సినిమా కథ.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో మా అమ్మ గర్వపడుతోంది.. వీడియో వైరల్!

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

CM Revanth Reddy: 21న సిటీలో సీఎం టూర్.. పలు అభివృద్ది పనులు ప్రారంభం!

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?