Anupam Kher: గోడ దూకడం అనగానే అందరూ మరో రకంగా అర్థం చేసుకుంటారేమో. ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోడ దూకింది నిజమే కానీ, మీరనుకుంటున్న విషయానికి అయితే కాదు. అలాంటి విషయానికి గోడ దూకే వయసు ఆయనది కాదు. అందుకని నెగిటివ్‌గా ఆలోచించడం మానేసి, అసలు ఈ గోడ దూకడం వెనుకు ఉన్న విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విషయంలోకి వస్తే.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్.. హైదరాబాద్‌లో గోడ దూకుతూ కనిపించారు. ఆయనది ముంబై అయితే, హైదరాబాద్‌లో గోడ దూకడం ఏమిటని అనుకోవచ్చు? పూర్తిగా చదివితేనే కదా తెలిసేది. అప్పుడే మైండ్‌లో ఏవేవో ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటారు. ప్రశాంతంగా వార్తని చదవండి.
Also Read- Akkineni Amala on Zainab: అక్కినేని వారి కొత్త కోడలికి కండిషన్లు పెట్టిన అమల.. తట్టుకోగలదా?
అనుపమ్ ఖేర్‌కు ఈ మధ్య బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ సినిమాలలోనూ అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత అనుపమ్ ఖేర్ కోసం ప్రత్యేకంగా మన దర్శకులు ఓ పాత్రను సృష్టిస్తున్నారు.. లేదంటే వారు అనుకున్న పాత్రకు కళ్లకు కట్టినట్లుగా ఆయనే కనిపిస్తున్నారు. అందుకే ఆయన కోసం టాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. అయినా ఇప్పుడు సినిమాలు.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే లెక్కలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడొస్తున్న సినిమాలలో అన్నీ ఇండస్ట్రీలకు చెందిన వారు ఉంటున్నారు. ఇది సినిమా బిజినెస్‌కు వరంగా మారుతుంది. అన్ని ఇండస్ట్రీలలోని వారు ఉంటే, పాన్ ఇండియా సినిమా పబ్లిసిటీకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఇదే ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే బాలీవుడ్‌కి చెందిన అనుపమ్ ఖేర్‌కు టాలీవుడ్ అవకాశాలు విరివిగా వస్తున్నాయి.
Also Read- Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!
ప్రస్తుతం అనుపమ్ ఖేర్ టాలీవుడ్‌లోని పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. అందులో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘ఫౌజీ’ (ఇంకా ఖరారు కాలేదు) ఒకటి. 1940 నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఇటీవలే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. అయితే షూటింగ్ లొకేషన్‌కు వెళ్లే క్రమంలో డ్రైవర్ దారి తప్పడం, కారు రివర్స్ చేసుకోవడానికి సాధ్యం కాకపోవడంతో.. కారులో నుంచి దిగిన అనుపమ్ ఖేర్ గోడ దూకి షూటింగ్‌కు చేరుకున్నారు. ఆ కారు ఆగిపోయిన పక్కనే షూటింగ్ జరుగుతున్న ప్రదేశం. సమయం మించి పోతుందని భావించిన అనుపమ్ ఖేర్ వెంటనే ఓ నిచ్చెన తెప్పించుకుని, అక్కడున్న కాంపౌండ్ వాల్ దూకేసి షూటింగ్‌కు చేరుకున్నారు. అది ఈ గోడ దూకడం వెనుక ఉన్న అసలు కహానీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోడ దూకి సినిమా షూటింగ్ కు..#Prabhas నటిస్తున్న #Fauji షూట్ కోసం అనుపమ్ ఖేర్ హైదరాబాద్‌కి వచ్చారు. డ్రైవర్ దారి తప్పారు. కారు రివర్స్ సాధ్యం కాలేదు.
కాంపౌండ్ వాల్ పక్కనే షూటింగ్ జరుగుతుండటంతో యూనిట్ సభ్యులు నిచ్చెన సాయంతో ఆయనను లోపలికి తీసుకెళ్లారు. pic.twitter.com/0lIWg1EdHw
— Movies4u Official (@Movies4u_Officl) June 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు