Annagaru Vostaru: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Kollywood Star Hero Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో రిలీజ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా అన్ని గడ్డు పరిస్థితులను దాటుకుని పొంగల్ బరిలో దిగింది. కాకపోతే తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాలేదు. పొంగల్‌కు రావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడటంతో.. అప్పటికప్పుడు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. టాలీవుడ్‌లో సంక్రాంతికి భారీ పోటీ ఉండటంతో, ‘అన్నగారు వస్తారు’ తెలుగులో రిలీజ్ కాలేదు. ఫైనల్‌గా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
Also Read- Fauzi Movie: ఆ పండగే టార్గెట్‌గా.. ‘ఫౌజీ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన టీమ్!
అనుకున్న ఒప్పందం ప్రకారమే..
విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. డిసెంబర్ ఎండింగ్‌లో విడుదలను దృష్టిలో పెట్టుకుని 4 వారాల వ్యవధిలో ఓటీటీలో రిలీజ్ చేసుకునేలా హక్కులు ఉండటంతో, ముందు అనుకున్న డేట్‌కే ప్రైమ్ వీడియో ఓటీటీ స్ట్రీమింగ్‌కు తెచ్చేసింది. అయితే థియేటర్లలో కూడా ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఓటీటీ రిలీజ్ విషయంలో ఎటువంటి అడ్డంకులు ఎదురుకాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందనే వస్తున్నట్లుగా తెలుస్తోంది. సౌత్ పరంగా ఈ సినిమా టాప్ 1లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో రిలీజ్ ఆగిపోవడం కూడా ఇప్పుడు ఓటీటీకి కలిసొచ్చింది. అందుకే ఓటీటీలో ఈ సినిమాకు ఆదరణ బాగుందనేలా చిత్రయూనిట్ తెలుపుతోంది. ఇది ఎన్ని రోజులు అనేది చూడాలి. అందులోనూ ఈ శుక్రవారం నుంచి ‘దురంధర్’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. ఇది ‘అన్నగారు వస్తారు’పై భారీ ఎఫెక్ట్ పడేలా చేస్తుందనేలా టాక్ నడుస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Also Read- Chiranjeevi: రీ ఎంట్రీలో కాజల్, తమన్నా అంటే ఎవరని అడిగా..!
కథ ఇదే..
అన్నగారు వస్తారు కథ విషయానికి వస్తే.. రాము అలియాస్ రామారావు సరిగ్గా సీనియర్ ఎన్టీఆర్ కన్నుమూసిన సమయంలోనే పుట్టడంతో.. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన అతని తాత (రాజ్ కిరణ్).. అన్నగారే మళ్ళీ పుట్టారని భావిస్తాడు. తన మనవడిని ఎన్టీఆర్‌లానే పెంచడం మొదలు పెడతాడు. తన మనవడు హీరో అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాము హీరోగా కాకుండా విలన్‌గా బతుకుతూ.. తన తాతకి దొరకకుండా ప్రయత్నిస్తుంటాడు. పోలీస్ అఫీసర్ అయిన రాము.. లంచం తీసుకుని సస్పెండ్ అవుతాడు. ఆ విషయం తాతకు తెలియనివ్వడు. అదే సమయంలో పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమైన బడా బిజినెస్ మెన్ భక్తవత్సలం (సత్యరాజ్), పర్యావరణానికి హాని కలిగించే ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. అతని సీక్రెట్‌ని పసుపు ముఖం అనే టీమ్ హ్యాక్ చేస్తుంది. ఆ టీమ్‌ని పట్టుకునే బాధ్యతని రాము తీసుకుంటాడు. రాముకు, భక్తవత్సలంకు లింక్ ఎక్కడ కలిసింది? పసుపు ముఖం టీమ్ ఎవరు? ఎందుకు అతని సీక్రెట్‌ని హ్యాక్ చేశారు? ఆ టీమ్‌ని రాము పట్టుకున్నాడా? భక్తవత్సలం ప్రాజెక్ట్ రహస్యాలేంటి? అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

