Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఈ సంక్రాంతికి వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలక పాత్రలో అలరించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మాంచారు. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార హీరోయిన్‌గా చేయడానికి చాలా ఆలోచిస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ అయితేనే కాంబినేషన్ సినిమాలు చేస్తుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనగానే ఆమె ఎలా అంగీకరించిందా? అని అంతా అనుకుంటున్నారు. ఇదే డౌట్ మెగాస్టార్ చిరంజీవికి కూడా వచ్చింది.
Also Read- Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!
అసలు ఎలా ఒప్పించావ్..
తాజాగా సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్వ్యూకు విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు అండ్ సుష్మిత కూడా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను గురువారం సాయంత్రం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో.. ఇంతకు ముందు చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార (Nayanthara) నాకు పవర్ ఫుల్ సిస్టర్‌గా నటించింది. ఈ సినిమాలో నాకు భార్యగా ఎలా అంగీకరించింది? అసలు టాలీవుడ్‌లో ఆమె సినిమాలు చేయడం లేదు కదా.. అందులోనూ ప్రమోషన్స్ చేయడానికి కూడా ఆమె రెడీ అని అనడం.. అసలు ఎలా ఒప్పించావ్? అని అనిల్ రావిపూడిని చిరంజీవి అడిగారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని, ఆమెకు విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా కథని వినిపించానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
Also Read- Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?
నయనతారకు ఏం చెప్పానంటే..
‘‘నేను కథ రాసుకున్నప్పుడే.. ఇందులో వేలు చూయించి వార్నింగ్ ఇవ్వడాలు, ఆమె ముందు మీరు కాస్త బెరుకుగా ఉండటాలు ఉన్నాయ్. అలాంటి పాత్ర చేయాలంటే కచ్చితంగా పెద్ద హీరోయిన్ కావాలి. నయనతార కాకుండా వేరే ఎవరినీ తీసుకున్నా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. అప్పుడు నిర్మాత సాహు.. ఆమె టీమ్‌ని కదిలించారు. ఆ తర్వాత సుస్మిత లైన్‌లోకి దిగారు. ఆమెకు నయనతార పరిచయం ఉండటంతో, ఆమె అటు నుంచి నరుక్కొచ్చారు. వీళ్లద్దరూ బ్యాకెండ్‌లో వర్క్ చేసి పెట్టారు. ఆ తర్వాత నాకు ఫోన్‌లోకి టచ్‌లోకి వచ్చారు. ముందు ఆమెకు కథ చెప్పాను. కథ విని ఎగ్జయిట్ అయ్యారు. అప్పుడే కొన్ని టెక్నికాలిటిస్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇక ఆమె చేయరేమో అనే పరిస్థితికి వచ్చేశారు. ఇక డ్రాప్ అవుదామనుకునే టైమ్‌కి ఆమెనే ఫోన్ చేశారు. ‘అనిల్ స్ర్కిప్ట్ నాకు బాగా నచ్చింది. చిరంజీవిగారితో సినిమా చేయాలని అనుకుంటున్నాను. అందులోనూ వెంకీగారు కూడా ఉన్నారు. ఇది సూపర్ ప్రాజెక్ట్. ఏం చేద్దాం ఇప్పుడు?’ అని నన్ను ప్రశ్నించారు. ‘నేనిప్పుడు నో చెబితే నువ్వేం చేస్తావ్?’ అంది. ఏముందండి.. మీరు దృశ్యం సినిమా చూశారా? ఆ సినిమా చూసి పడుకుంటాను. నేను నయనతారకు కథ చెప్పలేదు. నేనసలు ఆమెను కలవలేదు. నేనసలు ఫలానా డేట్ రోజు ఆమెతో ఫోనే మాట్లాడలేదు అనుకుని పడుకుంటాను. ఇదంతా కల అనుకుంటానని చెప్పగానే ఆమె గట్టిగా నవ్వి.. ఈ సినిమా నీకోసం చేస్తున్నాను అని చెప్పారు..’’ అని అనిల్ రావిపూడి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా నయనతార ఈ సినిమాలోకి ఎంటరైందన్నమాట.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

