Anchor Ravi (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anchor Ravi: ఆ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. ప్రత్యక్షంగా చూశా.. యాంకర్ రవి

Anchor Ravi: బుల్లితెర యాంకర్ రవి (Anchor Ravi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడటానికి కుర్రాడిలా ఉండే రవి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చకున్నాడు. బుల్లితెర షో ల మీద తన మార్క్ కనబడుతుంది. తెలుగు టీవీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ మేల్ యాంకర్, సంథింగ్ స్పెషల్ (Something Special show) షోతో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ ఒక్క షోతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రవి, ఆ తర్వాత పటాస్ (Pataas), ఆడాళ్ల మజాకా (Adalla Majaka ), ఆడాళ్లు మీకు జోహార్లు, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకీ పెళ్లాం, కిర్రాక్, అలీ టాకీస్ లాంటి షోలతో సందడీ చేశారు.

Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తన హుషారైన యాంకరింగ్‌తో అందర్ని నవ్విస్తాడు. కానీ, ఈ గ్లామర్ ప్రపంచంలో అంతా సాఫీగా సాగదని రవి తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుండగా, ఓ మహిళా యాంకర్ (Female anchor)తనపై చేతబడి (Black magic claims) చేయించి, కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించిందని రవి సంచలన కామెంట్స్ చేశారు. “మాతో పాటు ఉండే ఓ లేడీ యాంకర్, ట్రెండింగ్‌లో ఉన్న ఓ పూజారి దగ్గరకు వెళ్లి నా పతనం కోసం ప్రత్యేక పూజలు చేయించింది. ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు. వాటిలో నేను కొన్ని విషయాలు స్వయంగా చూశాను. వాళ్లకు ఇందులో ఏ ఆనందమో తెలియదు, కానీ నేను అలాంటి వాటిని నమ్మను. ఇవేమీ నన్ను ఏం చేయలేవని నమ్మకం ఉందని రవి ధీమాగా చెప్పారు.

Also Read: Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్‌ ఇండియా ఆ హీరోకి దాసోహం!

అయితే, ఆ లేడీ యాంకర్ ఎవరనే విషయాన్ని రవి బయటపెట్టకపోవడంతో, ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరు? రవిపై ఆమెకి ఎందుకు ఇంత కక్ష? దీని వెనక అసలు కథేంటి? అని నెటిజన్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read: Raksha Bandhan: రాఖీ పండుగ ఎందుకు జరుపుకోవాలి.. రాఖీ కట్టకపోతే ఏమవుతుందో తెలుసా?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!