Anasuya Reaction: ప్రముఖ నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలం, పరోక్షంగా వారిని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీ తీరును తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ కూడా స్పందించారు. ‘ఇది మా బాడీ మీది కాదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి యాంకర్ ఝాన్నీ కూడా మద్ధతు పలుకుతున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా రంగంలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ, ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ నటీమణులు చీరలు కట్టుకోవాలని, శరీరాన్ని కప్పి ఉంచుకోవాలని చెబుతూ కొన్ని అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించడం పట్ల వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన వేదికలపై ఇలాంటి పదజాలం వాడటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
Read also-Shambala Buzz: ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో తగ్గేదేలేదంటున్న‘శంబాల’.. సాయికుమార్ హ్యాపీ..
శివాజీ వాడిన కొన్ని పదాలు మహిళలపై ద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని, ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలను వేధించే ‘ఇన్సెల్’ గ్రూపులకు ఇవి ఊతమిచ్చేలా ఉన్నాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో విలన్‌గా నటించిన వారు నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. “పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్స్ మీద ఇంత బహిరంగంగా మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడుతుంటే, ఇక అమ్మాయిలకు ఇక్కడ భద్రత ఎక్కడ ఉంటుంది?” అని చిన్మయి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించే మగవారి ఆలోచనా విధానాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే వ్యక్తులు మొదట తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాలని, ఎదుటివారి గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడటం నేర్చుకోవాలని ఈ వివాదం ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.
Read also-Prabhas Charity: ప్రభాస్ చేసిన పనికి సలాం కొడుతున్న రాజీవ్ కనకాల.. ఎందుకంటే?
యాక్టర్ శివాజీ ఆడవారిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. ‘దండోర’ సినిమా డిసెంబర్ 25, 2025న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ ఆడవారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడే శివాజీ ఇప్పుడు కూడా ఆడవారు గురించి, వారు వేసుకునే బట్టలు గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘అమ్మాయిలు హీరోయిన్లు మీరు కనబడేలా బట్టలు వేసుకుని పోతే మనమే నిందలు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఏం అనుకోవద్దు మంచిగా చీర కట్టుకని రండి, ఎంతో అందంగా ఉంటుంది. మీ అందం నిండుగా చీరకట్టుకునే బట్టల్లో ఉంటుంది తప్పితే సామన్లు కనబడే దాంట్లో ఏం ఉండదు. మీ ముందు చాలా మాట్లాడతారు. చాలా బావున్నావు అంటారు, నువ్వు వెళ్లి పోయిన తర్వాత అంటారు ఇలాంటి బట్టలు వేసుకుంది కొంచెం మంచి బట్టుల వేసుకోవచ్చుకదా.. బావుంటావు కదా అంటూ మాట్లాడుకుంటారు. అంటూ చెప్పుకొచ్చారు. చాలా మందికి అలా అనాలనిపిస్తుందని కానీ అనలేమని, ఎందుకంటే స్త్రీ స్వతంత్రం స్వేచ్ఛ అంటారు అని చమత్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2025

