Anaganaga Oka Raju: సంక్రాంతి పండుగ రేసులోకి ఆలస్యంగా వచ్చిన, అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ రాజుగారు సెంచరీ కొట్టేశారు. అవును, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి జంటగా మారి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) కేవలం ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 100.2 కోట్ల గ్రాస్ (Anaganaga Oka Raju Collections)ని కలెక్ట్ చేసి, బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలోకి అడుగుపెట్టిందీ చిత్రం. అన్ని చోట్ల విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని.. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఫలితంగా ఇప్పుడు చరిత్రాత్మక విజయాన్ని ఈ సినిమా నమోదు చేసింది. సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనేది నిజంగా అరుదైన ఘనతగా చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాల్లోనూ సంచలన వసూళ్లతో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Also Read- Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి
2 మిలియన్ మార్క్ వైపు
ఈ విజయంతో నవీన్ పొలిశెట్టి తన నాలుగో వరుస బ్లాక్‌బస్టర్‌ను సాధించి, తెలుగు సినీ పరిశ్రమ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ప్రతి సినిమాతో తన మార్కెట్‌ని పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో తన సినీ ప్రయాణంలోనే అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్‌ను రాబట్టి.. మరో మైలురాయిని నమోదు చేసింది. యూఎస్‌లో నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో 1 మిలియన్‌కు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్దిమందికే దక్కిన అరుదైన ఘనత అని తెలియంది కాదు. 1 మిలియన్ అధిగమించి.. రోజువారీ కలెక్షన్లు బలంగా ఉండటంతో ‘అనగనగా ఒక రాజు’ ఇప్పుడు ప్రతిష్టాత్మక 2 మిలియన్ మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ సినిమాతో నిర్మాతల పంట పండిందనేలా అప్పుడే టాలీవుడ్ టాక్ నడుస్తుంది. ఎందుకంటే, చాలా తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వారికి భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది.
Also Read- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!
కేవలం ఐదు రోజుల్లో సెంచరీ..
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. సంక్రాంతి పోటీలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు అంతా సినిమాకు అండగా నిలిచి, సినిమా విడుదలకు సహకరించినట్లుగా నిర్మాత నాగవంశీ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు. సినిమాపై నమ్మకంతో కీలక ప్రాంతాల్లో కూడా వారు తగినన్ని థియేటర్లను ఈ సినిమాకు కేటాయించి, విడుదల చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకుల పెద్దఎత్తున థియేటర్లకు కదిలిరావడంతో, రికార్డు స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్లు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్, యూఎస్‌లో హ్యాట్రిక్ మిలియన్ డాలర్, నాలుగు వరుస బ్లాక్‌బస్టర్లు.. ఇలా ‘అనగనగా ఒక రాజు’తో ఎన్నో ఘనతలు నవీన్ పొలిశెట్టి సాధించి, ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా జోరు ఇప్పట్లో అయితే ఆగే సూచనలు లేవు. ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను చేరుకునే దిశగా పరుగులు పెడుతోందని నిర్మాతలు చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

