Allu Arjun
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: ఆ మలయాళ దర్శకుడితో మూవీ.. సోషల్ మీడియా షేకవుతోంది!

Allu Arjun: ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. కొన్ని నెలలుగా వార్తల్లో తెగ వైరల్ అవుతున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ టైమ్‌లో సంధ్య థియేటర్ ఘటనతో వార్తల్లో నిలిచిన అల్లు అర్జున్, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)ని కాదని కోలీవుడ్ దర్శకుడు అట్లీ (Atlee)తో హై రేంజ్ బడ్జెట్ చిత్రాన్ని ఓకే చేశారు. దీంతో అంతా షాకయ్యారు. ఎందుకంటే, ‘పుష్ప2’ సినిమా తర్వాత, పురాణాల నేపథ్యంలో త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరి ఏమయిందో ఏమో తెలియదు కానీ, సడెన్‌గా ఆ ప్రాజెక్ట్ మరో హీరో చేతుల్లోకి వెళ్లినట్లుగా టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ మరో సినిమా విషయంలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఒక వారం రోజులుగా సోషల్ మీడియా అంతా అల్లు అర్జున్ గురించే చర్చలు నడుస్తున్నాయి. అవేంటంటే..

Also Read- Madhoo: లిప్‌ కిస్‌‌ చేయకూడదని అనుకున్నా, చేయాల్సి వచ్చింది.. కానీ?

అట్లీతో చేస్తున్న సినిమా అనంతరం ఐకాన్ స్టార్.. మరో దర్శకుడికి ఓకే చెప్పాడని, ఆ దర్శకుడెవరో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారనేలా టాక్ వినబడుతుంది. అంతేకాదు, ఆ దర్శకుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడనే క్లూ కూడా బయటికి వచ్చింది. నిజంగా ఇది సంచలన విషయమే. ఎందుకంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న పొజిషన్‌లో చాలా సేఫ్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. సినిమాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు.. ఆయనను ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందులోనూ త్రివిక్రమ్ వంటి దర్శకుడినే పక్కన పెట్టి, కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మలయాళ దర్శకుడితో సినిమా అంటే, కచ్చితంగా బన్నీ నిర్ణయాలపై అనుమానాలు రావడం సహజమే. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఒకింత షాక్ అవుతున్నారు. ఇదేంటి మావాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? అని చర్చలు కూడా మొదలెట్టారు.

Also Read- Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా‌ ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!

ఎంతగా అనుమానాలు వ్యక్తమైనా, విషయం లేకుండా అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోడనే ధీమా కూడా ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతుంది. ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో? అనే సామెతలా.. అల్లు అర్జున్‌కి ఆ దర్శకులు చెప్పిన కథ కొత్తగా ఉండి ఉండొచ్చు. ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేయడం కాకుండా.. కాస్త కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నాడేమో? అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని అనుకునేవారు కూడా లేకపోలేదు. ఇక వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘మిన్నల్ మురళి’ ఫేమ్ బసిల్ జోసెఫ్ (Basil Joseph) అనే యంగ్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడట. అదీ కూడా 90స్ తరానికి బాగా తెలిసిన శక్తిమాన్ పాత్ర తరహాలో ఉండే ఓ సూపర్ హీరో రోల్ అని టాక్. ‘మిన్నల్ మురళి’ సినిమా చూసిన వారికి బసిల్ జోసెఫ్ సత్తా ఏంటో తెలుస్తుంది. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడంటే.. ఆ మాత్రం షేక్ అవకుండా ఎలా ఉంటుంది? కాకపోతే, సోషల్ మీడియాలో వార్తలే కానీ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని కూడా టాక్ వినబడుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు