Allari Naresh: అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ (12A Railway Colony). నూతన దర్శకుడు నాని కాసరగడ్డ (Nani Kasaragadda) దర్శకత్వంలో.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ‘పోలిమేర’ మూవీ సిరీస్ చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నవంబర్ 21న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. (Allari Naresh 12A Railway Colony Interview)
Also Read- VK Naresh: వీకే నరేష్‌లో ఉన్న నటుడిని పక్కన పెట్టి.. ఆ (పవిత్ర) కోణంలోనే చూస్తున్నారా?
‘మహారాజా’ తరహాలో స్క్రీన్‌ప్లే..
‘‘ఇది నాకు 63వ సినిమా. ప్రతి సినిమాకు టెన్షన్, ఎక్జయిట్‌మెంట్ ఉంటుంది. ఈసారి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చాలా మంచి టీమ్‌తో పనిచేశాం. ఈ శుక్రవారం నాదేననే ఫీలింగ్‌లో ఉన్నా. ఇప్పటి వరకు నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. అందుకే ఈసారి అది ట్రై చేశాను. ఈ సినిమాలో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్‌లో యదార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో చేయడం జరిగింది. అనిల్ ఇంటర్వెల్ వరకు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. సెకండాఫ్ ఎలా ఉండబోతుందో అనిపించింది. ‘మహారాజా’ సినిమా తీసుకుంటే అందులో స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కడో మొదలైన సీన్‌కి చివరిలో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. అద్భుతమైన మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయని అనుకుంటున్నాను.
మల్టీ టాలెంటెడ్
ఇది 12A అనే ఇంటిలో జరిగే కథ. 12A అనేది ముందుగా ఫిక్స్ అయ్యాం. తర్వాత ఏ కాలనీ పెట్టాలి అనుకున్నప్పుడు అనిల్.. రైల్వే కాలనీ పెడితే అందరికీ కనెక్టింగ్‌గా ఉంటుందని చెప్పారు. ఇది ఒక రైల్వే కాలనీ బ్యాక్ డ్రాప్‌లోనే జరుగుతుంది. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. హీరోయిన్ కామాక్షి వాళ్ల నాన్నగారు మా నాన్నగారి దగ్గర వర్క్ చేశారు. తను ఇంటర్ చదువుతున్న టైమ్‌లో నా సినిమాల షూటింగ్‌కి వచ్చేది. ఇంతకుముందు నా మారేడుమిల్లి సినిమాలో కూడా చేసింది. ఈ సినిమాకి ఒక మిడిల్ క్లాస్, పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే తీసుకోవడం జరిగింది. తను మల్టీ టాలెంటెడ్. అనిల్ చాలా ఫాస్ట్ రైటర్. ఏ మార్పులు చెప్పినా ఇట్టే చేసేస్తాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించాం.
Also Read- MLA Raja Singh: రాజమౌళిని జైల్లో వేస్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!
నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పా..
ఇది వరంగల్‌లో జరిగే కథ. తెలంగాణ యాస కోసం అజయ్ అనే ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ తెలంగాణ యాస మాట్లాడుతున్నానని చాలా శ్రద్ధ తీసుకున్నాను. నేను ప్రతి సినిమాకి దాదాపు ఒక్క రోజులోనే డబ్బింగ్ చెప్పేస్తాను. కానీ ఈ సినిమాకు మాత్రం నాలుగు రోజులు పట్టింది. ప్రతి డైలాగ్ చెక్ చేసుకుంటూ యాస సరిగ్గా పలికేలా చాలా కేర్ తీసుకున్నాను. ఇందులో కార్తీక్ అనే పాత్రలో కనిపిస్తాను. అక్కడ ఒక లోకల్ ఎమెల్యే దగ్గర పని చేస్తూ.. తన తలలో నాలుక లాంటివాడిగా ఉంటాను. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. అంతా సరదాగా జరిగిపోతున్నప్పుడు ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన కార్తీక్ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది అనేదే ఈ సినిమా కథ’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

