Alpha Movie: బాలీవుడ్ స్టార్ కాస్ట్ ఆలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’. అయితే, ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ మన ముందుకు రాబోతోంది. మొదటసారి ఈ చిత్రం 2025 డిసెంబర్ 25న అనౌన్స్ డేట్ ను రిలీజ్ చేశారు. కానీ, కొత్త ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ 17 న మన ముందుకు రాబోతుంది.
వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా విడుదల వాయిదా
సినిమా మేకర్స్ తెలిపిన ప్రకారం, ‘ఆల్ఫా’లో ఉన్న భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇంకా పూర్తి కాలేదు. అత్యున్నత స్థాయి విజువల్ అనుభూతి ఇవ్వడానికి అదనపు సమయం అవసరమని వారు తెలిపారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతినిధి మాట్లాడుతూ, ‘ఆల్ఫా’ మాకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. దీన్ని అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుంచాలని కోరుకుంటున్నాం. వీఎఫ్‌ఎక్స్ పనులు కోసం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాము. అందుకే, ఏప్రిల్ 17, 2026న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.
మొదటి మహిళా ఆధారిత స్పై యూనివర్స్ చిత్రం
‘ఆల్ఫా’ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇది YRF స్పై యూనివర్స్‌లో మొదటి మహిళా ప్రధాన పాత్రలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఆలియా భట్, శర్వరి వాఘ్‌తో పాటు ప్రముఖ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా, శర్వరి ఒకవైపు, బాబీ డియోల్ మరోవైపు ఉత్కంఠభరితమైన యాక్షన్ పోరాటాన్ని చూడబోతున్నాం.
Also Read: Harassment Case: అసభ్యకరంగా మహిళను వేధిస్తున్న కీచక డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడంటే..?
వాయిదా వెనుక అసలు కారణం
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదల తేదీ మార్పుకు కారణం వీఎఫ్‌ఎక్స్ పనుల ఒత్తిడి మాత్రమే, కానీ ఇతర చిత్రాల విడుదల కారణమే కాదు. ‘ఆల్ఫా’ టీమ్ ఆడియెన్స్ కు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటోంది. వీఎఫ్‌ఎక్స్ టీమ్‌పై టైమ్‌లైన్ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సమయం ఎక్కువ తీసుకున్నారు. దాని వలన ఈ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతోంది” అని తెలిపింది.
ప్రేక్షకుల కోసం భారీ యాక్షన్ విందు
‘ఆల్ఫా’లో మహిళా శక్తిని ప్రతిబింబించే హై యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. YRF స్పై యూనివర్స్‌లోని ఈ కొత్త అధ్యాయం ఆడియెన్స్ ఒక కొత్త అనుభూతిని అందించబోతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
