Aishwarya Rai Divorce: సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మొన్నటి వరకు ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నరంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు వాటికి చెక్ పెట్టేందుకు ఇద్దరూ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
తాజాగా, ఓ పెళ్లి వేడుకలో అభిషేక్- ఐశ్వర్య ఇద్దరూ మెరిశారు. వారితో పాటు కూతురు ఆరాధ్యతో కుటుంబ సమేతంగా వెళ్ళారు. అయితే, సింగర్ రాహుల్ వైద్య పాట పాడుతుండగా అభిషేక్ కుటుంబం డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఐశ్వర్య డాన్స్ చేస్తుంటే.. అభిషేక్, ఆరాధ్య చప్పట్లు కొడుతూ .. సూపర్ అంటూ ఆ మూమెంట్ ను ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్ని ఆకట్టుకుంటోంది.
Also Read: Naga Chaitanya: మామ లవర్ తో నాగచైతన్య బోల్డ్ రొమాన్స్.. ఘాటు సీన్స్ తో కుర్రకారుకు మతి పోవడం పక్కా!
అభిషేక్ స్టైలిష్ లుక్ లో కనిపించగా.. ఐశ్వర్యా మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. వారితో పాటు కూతురు ఆరాధ్య బ్యూటిఫుల్ లెహంగా వేసుకుంది. ఇదిలా ఉండగా.. ఐశ్వర్య – అభిషేక్ ఇద్దరూ కలిసి 18వ మ్యారేజ్ యానివర్సరీ ను గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య ఇంస్టాగ్రామ్ లో ఫోటో ను కూడా షేర్ చేసింది.