Dacoit Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న కథానాయకుడు అడివి శేష్. కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్-2’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా నిలిచారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా, శేష్ నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ (Dacoit) నుండి చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చింది. సాధారణంగా కొందరు వ్యక్తులు సమాజం నిర్దేశించిన నియమాలను పాటిస్తూ జీవిస్తారు. కానీ మరికొందరు ఆ నియమాలను బ్రేక్ చేసి తమకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకుంటారు. అడివి శేష్ నిజజీవితంలోనూ, వెండితెరపైన కూడా అదే బాటలో పయనిస్తుంటారు. అందుకే ఈ సినిమా పోస్టర్ మీద “Some men are born to follow rules. Some are born to break them” అనే క్యాప్షన్ సినిమాపై అమితమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో శేష్ మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. అడవిశేష్ కథల ఎంపికలో మంచి టేస్ట్ ఉండటంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీజర్ లాంచ్..
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘డెకాయిట్’ టీజర్ రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ టీజర్ లాంచ్ కోసం చిత్ర యూనిట్ ఒకే రోజు రెండు మెట్రో నగరాలను ఎంచుకోవడం విశేషం. తెలుగు ప్రేక్షకుల కోసం భాగ్యనగరంలో గ్రాండ్ ఈవెంట్. బాలీవుడ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలో భారీ ప్రమోషన్ కార్యక్రమం. ఈ రెండు నగరాల్లో నిర్వహించనున్న ఈవెంట్లతో సినిమా హైప్ ఒక్కసారిగా నేషనల్ లెవల్‌కు చేరుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు హీందీ భాషల్లో సపరేట్ గా చిత్రీకరించారు. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ సాధించుకుంది.
Read also-Mega War: రామ్ చరణ్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందులోనంటే?
రిలీజ్ ఎప్పుడంటే..
ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 2026, మార్చి 19న ‘డెకాయిట్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. సమ్మర్ సీజన్ ప్రారంభంలో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాలో శేష్ సరసన స్టార్ హీరోయిన్ మృనాళ్ ఠాకూర్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ప్రేమ, పగ నేపథ్యంలో సాగే ఈ ‘డెకాయిట్’ కథలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి, తన పుట్టినరోజున అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు అడివి శేష్. ఒకవైపు టీజర్ డేట్, మరోవైపు రిలీజ్ డేట్ ప్రకటించి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. వైవిధ్యమైన స్క్రిప్ట్ సెలక్షన్‌తో దూసుకుపోతున్న శేష్‌కు ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుంది.
Some men are born to follow rules.
Some are born to break them, on and off the screen 🔥Wishing our #Dacoit, @AdiviSesh a very Happy Birthday ✨#DacoitTeaser tomorrow ❤🔥
Grand Launch Events in Hyderabad & Mumbai ❤️🔥#DACOIT GRAND RELEASE WORLDWIDE ON MARCH 19th, 2026 in… pic.twitter.com/Sv1xUkA7BA
— Annapurna Studios (@AnnapurnaStdios) December 17, 2025

