Allu Arjun: గత కొద్దీ రోజుల నుంచి టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడీ కనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో భాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ” సంక్రాంతికి వస్తున్నాం ” సినిమా ఇచ్చిన బూస్ట్ కి తెలుగు సినీ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతక ముందు వరకు ఓటీటీలో చూసిన జనాలు ఇప్పుడు థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు. తాజాగా, అల్లు అర్జున్ కి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎట్టకేలకు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ చిత్ర ప్రకటన వచ్చిన రోజు నుంచి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిలో నటించే నటీ నటులు గురించి, టెక్నీషియన్స్ గురించి ఇప్పటికి చాలా వార్తలొచ్చాయి. అంతే కాదు, ఈ చిత్రానికి 20ఏళ్ల సాయి అభయంకర్‌ని సంగీత దర్శకుడిగా ఓకే చేసినట్లు వైరల్ అవుతోంది. అయితే, ఇంత వరకు దీనిపై చిత్ర బృందం స్పందించలేదు.
Also Read: Mulugu District: ప్రెషర్ మైన్లతో ములుగు ప్రజల ప్రాణాలకు ముప్పు.. జిల్లా ఎస్పీపి శబరిష్ సూచన
ఇక, ఇప్పుడు తాజాగా హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. ముందుగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అని అనుకున్నారు.. కాగా, తెర మీద సమంత పేరు బయటకొచ్చింది. ఇదే నిజమైతే చాలా గ్యాప్ తీసుకున్న సమంత మళ్లీ మేకప్ వేసుకోనుంది.
Also Read: Mahabubabad: మానుకోటలో నయా దందా.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు.. అధికారుల అండదండలతో!
అల్లు అర్జున్ తో సమంత ‘సన్నాఫ్ సత్యమూరి’ చిత్రంలో నటించింది. 2015 ఏప్రిల్ 9 న ఈ మూవీ రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి పదేళ్ళు అవుతుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బన్నీ తో సామ్ జోడి కట్టడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.