Srikanth
ఎంటర్‌టైన్మెంట్

Srikanth: శ్రీకాంత్‌కు ఏమైంది.. ఆ పూజలు ఎందుకు?

Srikanth: పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి చేయగల నటుల్లో శ్రీకాంత్ ఒకరు. మొదట్లో విలన్ పాత్రలు వేసి మెప్పించాడు. తర్వాత హీరోగా టర్న్ తీసుకుని సూపర్ సక్సెస్‌లు అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడి వందకు పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న శ్రీకాంత్, సడెన్‌గా శ్రీకాళహస్తిలో కుటుంబంతో సహా కనిపించడం, ప్రత్యేక పూజలు చేయించడం వైరల్ అవుతున్నది.

ప్రైవేట్ పూజలు ఎందుకు?

శ్రీకాళహస్తి క్షేత్రం రాహు-కేతు నివారణ పూజలకు ఫేమస్. ఆలయ ప్రాంగణంలో ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈనెల 29న పట్టణానికి వచ్చిన శ్రీకాంత్ ఫ్యామిలీ, సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో నవగ్రహ శాంతి పూజలు చేయిచుకున్నది. శ్రీకాళహస్తి ఆలయంలో పని చేసే అర్చకులు, వేద పండితులు దగ్గరుండి ఈ తంతు నిర్వహించారు. ఆలయంలో కాకుండా ప్రైవేట్‌గా ఈ పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందా అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఆలయ నిబంధనలకు విరుద్ధంగా..

శ్రీకాళహస్తి ఆలయ నిబంధనల ప్రకారం అక్కడ పని చేసే వారు ప్రైవేట్ పూజల్లో పాల్గొనకూడదు. ఇది తెలిసి కూడా అర్చకులు బయట పూజలు నిర్వహించడంపై ఎండోమెంట్ అధికారులు మండిపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు విచారణ చేశారు. శ్రీకాంత్ ఫ్యామిలీ ఆలయంలో కాకుండ బయట ప్రత్యేక పూజలు చేయించుకున్నదని నిర్ధారించారు.

Read Also- Sri Sri Sri Rajavaru: ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా విడుదలవుతోంది

పండితుడిపై సస్పెన్షన్ వేటు

శ్రీకాంత్‌ కుటుంబానికి ప్రైవేట్‌గా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వివాదంపై ఆలయ అధకారులతో ‘స్వేచ్ఛ’ మాట్లాడగా, శ్రీకాళహస్తిలో నిర్వహంచే పూజలు ఆలయ నియమాళికి లోబడే జరగాలని తెలిపారు. అర్చకులు, వేద పండితులు బయట ప్రైవేట్‌గ నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీకాంత్ సినీ కెరీర్

1968 మార్చి 23న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతిలో శ్రీకాంత్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డిప్లొమా పూర్తి చేశాడు. 1991లో ప్రజల సమావేశం సినిమాలో చిన్న పాత్ర చేశాడు. అప్పటి నుంచి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. విలన్ పాత్రలను సైత చేశాడు. 1993లో వచ్చిన వన్ బై టు మూవీతో ప్రధాన నటుడిగా ఆరంగేట్రం చేశాడు. తాజ్ మహల్ మూవీ శ్రీకాంత్‌కు 25వ చిత్రం. అక్కడి నుంచే సినీ కెరీర్ ఊపందుకున్నది. వరుసబెట్టి సినిమాలతో బిజీ అయ్యాడు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

Read Also- Flexies At Kavitha Home: కవిత ఇంటి ముందు ఆసక్తికర ఫ్లెక్సీలు.. ఆందోళనలో బీఆర్ఎస్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!