Ace Trailer: వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ విభిన్నమైన చిత్రంతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. విజయ్ సేతుపతికి జోడిగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ సంస్థ భారీ పోటీ మధ్య ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ ఈ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. మే 23న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Suriya46: సూర్య, వెంకీ అట్లూరి కాంబో ఫిల్మ్‌కు క్లాప్ పడింది.. కుర్ర హీరోయిన్ ఫిక్స్!
ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతూ విశేష స్పందనను రాబట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా విజయ్ సేతుపతిలోని వైవిధ్యతను చాటి చెప్పేలా ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ‘ఏస్’ ట్రైలర్‌ని ఒక్కసారి గమనిస్తే.. భాషా రేంజ్‌లో ‘నా పేరు బోల్ట్ కాశీ’ అంటూ హీరో తనని తాను పరిచయం చేసుకోవడంతో ట్రైలర్ మొదలైంది. ఆ పేరు ఏంటి? అలా ఉందేంటి? అంటూ యోగిబాబు కామెడీ చేయడం, హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, మలేషియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. జూదం అనేది ఉప్పెనలాంటిది.. క్లైమాక్స్ గుర్తుంది కదా! అంటూ యోగి బాబు చెప్పే డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. హీరో వేసే ప్లాన్ ఏంటి? అసలు దేని కోసం హీరో పోరాటం చేస్తున్నాడు? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.
Also Read- Aishwarya Rai Divorce: అభిషేక్ బచ్చన్ విడాకులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్ .. వీడియో వైరల్
సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కరణ్ బి. రావత్ కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్‌లో మరో మంచి సినిమాగా ఈ ‘ఏస్’ నిలుస్తుందనేలా ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది. ఇక సినిమాను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే విజయ్ సేతుపతి పేరు ‘ఉప్పెన’ తర్వాత మరోసారి టాలీవుడ్‌లో మారుమోగుతుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ దర్శకులు కూడా ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు వర్కవుట్ అయితే.. విజయ్ సేతుపతికి టాలీవుడ్‌లోనూ తిరుగుండదని చెప్పుకోవచ్చు. దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిసిల్లా నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర తారాగణం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు