Suriya46: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఈ మధ్య కాలంలో అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య, భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘కంగువా’ (Kanguva) సినిమా తీవ్ర నిరాశకు గురిచేయగా, ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘రెట్రో’ కూడా సూర్యకు సక్సెస్‌ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడాయన ఆశలన్నీ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేయబోతున్న సినిమాపైనే ఉన్నాయి. వెంకీ అట్లూరి (Venky Atluri) ఇప్పటికే పరభాషా నటులైన ఇద్దరికి సూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు. ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస సక్సెస్‌లతో దర్శకుడిగా తన సత్తా చాటిన వెంకీ అట్లూరి.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరో సూర్యతో చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
Also Read- Vishal Marriage: రజనీకాంత్ కుమార్తెతో హీరో విశాల్ పెళ్లి? అది దా సర్‌ప్రైజ్!
కోలీవుడ్ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరితో చేయబోయే సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకోబోతుంది. ఇది హీరో సూర్య నటిస్తున్న 46వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.33గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య (Hero Suriya).. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం నిండిన స్టోరీలను ఇచ్చేందుకు తపిస్తుంటారు. సూర్య సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా కుర్ర హీరోయిన్ మమిత బైజు (‘ప్రేమలు’ హీరోయిన్)ను ఫైనల్ చేశారు. ఈ భామ కూడా చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఇంకా ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ సౌత్‌లో పునఃప్రవేశం చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Also Read- Vishnu Manchu: ప్రభాస్‌ను పొగుడుతూ.. మంచు మనోజ్‌పై విమర్శలు!
సోమవారం త్రివిక్రమ్ శ్రీనివాస్ కొట్టిన క్లాప్‌తో ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించి కొందరు సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ ఫైనల్ చేశారు. వెంకీ అట్లూరి గత రెండు సక్సెస్ సినిమాలకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి ఆయనతో చేతులు కలుపుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా నిమిష్ రవి, ఎడిటర్‌గా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకుడిగా బంగ్లాన్‌ను ఫైనల్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అంతే స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో సూర్య కచ్చితంగా సంచలన హిట్‌ని నమోదు చేస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరో వైపు నిర్మాణ సంస్థ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందనేలా టాక్ నడుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు