Nagarjuna: సాయంత్రం ఆరు అవ్వగానే మహిళలు టీవిల ముందు అతుక్కుపోతారు. వెండి తెర పై సినిమాలు ఎలాగో, బుల్లి తెర పై సీరియల్స్ అలాగే. అక్కడ రెండు గంటల కోసం థియేటర్ కి వెళ్లి మరి ఎలాగా చూస్తారో? ఇక్కడ ప్రసారమయ్యే 30 నిముషాల సీరియల్ కోసం అలాగే, వేచి చూస్తారు. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే పాత సీరియల్ కు బై బై చెప్పి కొత్త సీరియల్స్ అనౌన్స్ చేసింది.
త్వరలో బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మరి, ఆ సీరియల్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Etela Rajender: కూలిపోవడమే తెలంగాణ ప్రభుత్వానికి మిగిలింది?.. ఈటల రాజేందర్ ఫైర్!
బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి కొత్త సీరియల్ మన ముందుకు రాబోతుంది. ఆరో ప్రాణం అనే కొత్త టైటిల్ రానుంది. ఇటీవల దీనికి సంబందించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. అయితే, త్వరలోనే ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. అయితే, రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు.
Also Read: Miss World 2025: సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణా.. విదేశీయులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు!
ఈ సీరియల్లో సీనియర్ యాక్టర్స్ రాజ్‌కుమార్, యుమన ముఖ్య పాత్రలు పోషించనున్నారు. నాగార్జున, వినూత గౌడ్ మెయిన్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఫ్యామిలీ & లవ్ డ్రామాగా మన ముందుకు రానుంది. జూన్ నెలలో ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిన సమాచారం. మధ్యాహ్నం టైమ్ లో సీరియల్ ప్రసారమవుతోందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
కొత్త సీరియల్ చూసే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కస్తూరి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న నాగార్జున మనందరికీ సుపరిచితమే. అతనికి జోడీగా వినూత గౌడ్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా రోజులవుతుంది ఒక మంచి సీరియల్ చూడక, చూస్తుంటే టైటిల్ కూడా కొత్తగా ఉంది. ఇక కథ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.